NBK112: కొరటాల సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ABN, Publish Date - Nov 01 , 2026 | 04:07 PM
నందమూరి బాలకృష్ణ హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK 112’. ఈ సినిమాకు బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK 112’. టాలీవుడ్లో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌గా వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య వంటి పవర్ ఫుల్ మాస్ హీరోను కొరటాల శివ ఏ స్థాయిలో చూపించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య రెమ్యునరేషన్ గురించిన ఓ హాట్ టాపిక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
నటసింహం బాలకృష్ణ సినిమాల జోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస హిట్లు కొడుతూ తన మార్కెట్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఒకప్పుడు రూ. 10 నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం (Remuneration) అందుకున్న బాలయ్య.. ఆ తర్వాత చేసిన సినిమాలతో తన రేంజ్‌ను గణనీయంగా పెంచారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ' సినిమాకు సుమారు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు తీసుకోగా.. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలకు రూ. 20 కోట్ల వరకు అందుకున్నట్లు టాక్ ఉంది. ఇక ‘అఖండ 2’ (Akhanda 2)కి దాదాపు రూ. 30 కోట్లు తీసుకున్నారట. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK 112’ సినిమా కోసం బాలయ్య తీసుకోబోతోన్న పారితోషికం గురించిన వార్తలు టాలీవుడ్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా రూ. 40 నుంచి రూ. 45 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇది అత్యధిక పారితోషికం అని సినీ వర్గాలు అంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపిస్తున్నారు బాలయ్య. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ప్రతిష్టాత్మక సినిమాను ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ మార్క్ కథాకథనాలు, బలమైన సామాజిక అంశాలు తోడైతే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రంలో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తదితరులు నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, నటీనటులు లేదా సాంకేతిక నిపుణుల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, అన్నీ రూమర్సేనని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే ఆయన కొరటాల శివతో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారట. ఏదేమైనా బాలయ్య - కొరటాల కాంబినేషన్ అంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ వార్తలు నిజమే అయితే మాత్రం బాలయ్య రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి:
‘మెగావర్స్’ ప్రోమో షూట్.. దర్శకుడెవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
అచ్చం అమ్మలాగే.. ‘నగీనా’ శ్రీదేవిగా జాన్వీ కపూర్.. హాలోవీన్ లుక్ వైరల్
మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో శ్రీలీల కాదా.. ఆ బాలీవుడ్ బ్యూటీయేనా?