‘మెగావర్స్’ ప్రోమో షూట్.. దర్శకుడెవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:21 PM

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టిస్తోందో తెలియంది కాదు.

Megaverse Promo Update

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా రాబోతున్న సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’ (MegaVerse) ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టిస్తోందో తెలియంది కాదు. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలతో కీలక ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. తాజాగా ఈ షో అధికారిక ప్రోమోకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.


ఈ మోస్ట్ అవైటెడ్ ‘మెగావర్స్’ ప్రోమోను తెరకెక్కించే బాధ్యతను బ్లాక్‌బస్టర్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తీసుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై డైరెక్ట్ చేయాలని హరీష్ శంకర్ (Harish Shankar) ఎప్పటినుంచో కల కంటున్నారు. పూర్తిస్థాయి సినిమా కంటే ముందే.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఓటీటీ షో ప్రోమో ద్వారా చిరును డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశం ఆయనకు దక్కింది. చిరంజీవిలోని వింటేజ్ స్వాగ్, మాస్ అండ్ క్లాస్ ఎనర్జీని హరీష్ శంకర్ తన మార్క్ పంచ్‌లు, పవర్‌ఫుల్ షాట్లతో ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తారోనని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


ఈ స్పెషల్ ప్రోమో షూటింగ్‌ను నవంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ హంగులతో నిర్వహించనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అరుదైన ఎపిసోడ్‌తో పాటు పలువురు భారతీయ అగ్ర తారలతో సిద్ధమవుతున్న ఈ టాక్ షో ప్రోమోను నవంబర్ నెలాఖరులో గ్రాండ్‌గా విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. హరీష్ శంకర్ మార్క్ టేకింగ్‌తో రానున్న ఈ ‘మెగావర్స్’ ప్రోమో కచ్చితంగా సోషల్ మీడియాను షేక్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అచ్చం అమ్మలాగే.. ‘నగీనా’ శ్రీదేవిగా జాన్వీ కపూర్.. హాలోవీన్ లుక్ వైరల్

మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో శ్రీలీల కాదా.. ఆ బాలీవుడ్ బ్యూటీయేనా?

‘ఆద‌ర్శ కుటుంబం’లో ఆ పాటని పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?

Updated Date - Nov 01 , 2026 | 03:21 PM

Megaverse: ఒకే స్టేజ్‌పై చిరు, పవన్, చరణ్.. మెగావర్స్‌లో మెగా ట్రీట్

‘మెగావర్స్’లో కమల్ హాసన్ - చిరంజీవిల క్రేజీ ప్రామిస్..

‘మెగావర్స్’.. చిరంజీవి కొత్త అవతారం

‘మెగావర్స్’ మొదటి లుక్ వచ్చేసింది..

మెగావర్స్.. చిరు వర్సెస్ కమల్.. ఇది కదా కావాల్సింది