NBK112 ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
ABN , Publish Date - Aug 17 , 2026 | 07:54 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై వస్తోన్న రూమర్స్‌కు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియా, వెబ్ మీడియా సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో (Nandamuri Fans) తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న రూమర్లపై చిత్ర యూనిట్ స్పందిస్తూ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ‘‘నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఎలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న NBK111 పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది’’ అంటూ టీమ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న నిరాధారమైన రూమర్లకు పూర్తిగా తెరపడినట్లైంది.
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బాలయ్య, కొరటాల శివ వంటి కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం ఇచ్చిన స్పష్టతతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాపై వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాలయ్యని ఇప్పటి వరకు చూపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కొరటాల చూపిస్తారని ఆశపడుతున్నారు. అలాంటి ఆశలతో ఉన్న వారంతా.. సడెన్‌గా ఈ సినిమా ఆగిపోయిందనేలా వార్తలు రావడంతో షాక్ అయ్యారు. ఇప్పుడు టీమ్ క్లారిటీ ఇవ్వడంతో వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ రానుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
నిన్న మహేశ్, నేడు బన్నీ.. లోకేష్ ‘డీసీ’కి ఫిదా!
డీమోన్ పవన్ హీరోగా చేస్తోన్న ‘సాV3’ టీజర్ విడుదల
పెద్ద మనసుతో క్షమించండి.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్