సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య - కొరటాల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

ABN, Publish Date - Nov 27 , 2026 | 05:12 PM

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో జతకట్టబోతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలిసారి రాబోతోన్న ఈ మూవీకి సంబంధించి, సంగీత దర్శకుడి విషయంలో ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

NBK112 Music Director

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)తో జతకట్టబోతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా ‘సింహా’ (Simha). 2010లో వచ్చిన ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు కొరటాల రచయితగా పనిచేశారు. ఆ సినిమాలో బాలయ్య పలికిన పవర్‌ఫుల్ డైలాగులు ఇప్పటికీ థియేటర్లలో మార్మోగుతూనే ఉంటాయి. అలాంటిది, ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా బాలయ్యను కొరటాల డైరెక్ట్ చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌ (NBK112)పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి. యువసుధ ఆర్ట్స్, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.


అదేంటంటే.. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి దీనికి కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడని బలంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే, కొరటాల శివ గత చిత్రం ‘దేవర’కు అనిరుధ్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అందుకే బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్‌నే తీసుకుంటారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కుమార్‌ (GV Prakash Kumar)ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. దర్శకుడు, నిర్మాతలు ఇప్పటికే జీవీని కలిసి కథను వివరించారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నిజానికి జీవీ ప్రకాశ్ కుమార్‌కు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆయన స్వరపరిచిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘ఇరుముడి’ వంటి చిత్రాల్లో ఆయన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ నెల 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇలాంటి ఫామ్‌లో ఉన్న జీవీ ప్రకాశ్.. తొలిసారి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో పనిచేయడం నిజంగా లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అంటే ఆయన స్టార్‌డమ్ నెంబర్ వన్‌కి చేరిందన్నమాట.


మరోవైపు, ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త మాస్ అవతార్‌లో చూపించేందుకు కొరటాల శివ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ‘దేవర’ తర్వాత కొరటాల తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో, స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇందులో బలమైన పొలిటికల్ అంశాలతో పాటు, గూస్‌బంప్స్ తెప్పించే పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని టాక్. ప్రస్తుతం బాలకృష్ణ ‘దాదా’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ఆ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. దాని రిలీజ్ పనులు పూర్తి కాగానే, వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొరటాల ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. మొత్తానికి ఒకవైపు కొరటాల శివ మార్క్ ఎమోషన్ అండ్ యాక్షన్, మరోవైపు బాలయ్య విశ్వరూపం, వీటికి తోడు జీవీ ఫ్రెష్ మ్యూజిక్.. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మీకు యాక్టింగ్ వస్తే.. ‘ఆర్సీ17’లో నటించే ఛాన్స్.. ఇలా ట్రై చేయండి?

విజయానికి ముందు... ఆ తర్వాత... సాత్విక వీరవల్లి చెప్పిన విశేషాలు

విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్య‌లు!

Updated Date - Nov 27 , 2026 | 05:12 PM