విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్య‌లు!

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:51 AM

హీరో విశాల్‌తో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆయనతో సినిమాలు చేయనని దర్శకుడు మిష్కిన్ స్పష్టం చేశారు. డిటెక్టివ్ సీక్వెల్స్, అంజాదే 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mysskin, Vishal

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, హీరోల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. అయితే కొన్ని మనస్పర్ధలు ఏకంగా క్రేజీ ప్రాజెక్టులనే ఆగిపోయేలా చేస్తుంటాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మిష్కిన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. హీరో విశాల్‌తో వచ్చిన సమస్యల కారణంగా 'డిటెక్టివ్' (తుప్పరివాలన్) సీక్వెల్స్ ఆలోచనను పక్కనపెట్టినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు.. 'అంజాదే' సీక్వెల్‌పైనా తన మనసులో మాట బయటపెట్టారు.

తాజాగా చెన్నైలో జరిగిన సినిమా ఈవెంట్‌లో దర్శకుడు మిష్కిన్(Mysskin) మాట్లాడుతూ.. నటుడు, నిర్మాత‌, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ న‌డుమ‌ వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆయనతో సినిమాలో చేయనని ప్రముఖ దర్శకుడు మిష్కిన్ వెల్లడించారు. 'నాకు 'తుప్పరివాలన్‌ (Thupparivaalan) (తెలుగులో డిటెక్టివ్‌) రెండు, మూడు, నాలుగు, ఐదు భాగాలు తీయాలనే ఆలోచన వచ్చింది. కానీ, హీరో విశాల్‌తో సమస్య రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. ఆయనతో ఇక సినిమాలు చేయ‌న‌ని తెలిపారు.

ఇక‌.. 2008లో విడుదలై ఘన విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంజాదే (Anjathe) సీక్వెల్ తీయాలన్న ఆలోచన ఉంది. కానీ, ఆ కథ ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అర్థకావడం లేదు. ఎందుకంటే, నేటి తరం (జెన్ జీ) ఆ కథను ఎలా అర్థం చేసుకుంటుందో తెలియడం లేదు.

పైగా అది భిన్నమైన కథ. ఆ చిత్రాన్ని నా యవ్వనంలో తీశాను. ఇకపోతే, ఇప్పుడు చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. వాటిలో నాకు చిన్న లోపం కనిపిస్తోంది. గత సినిమా విజయం ఆధారంగా సీక్వెల్ తీయొచ్చని వారు భావిస్తున్నారు. కానీ, నేను అలా చేయాలని అనుకోవడం లేదు' అని వివరించారు.

Updated Date - Nov 27 , 2026 | 07:56 AM