మీకు యాక్టింగ్ వస్తే.. ‘ఆర్సీ17’లో నటించే ఛాన్స్.. ఇలా ట్రై చేయండి?
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:28 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్సీ17’. తాజాగా నటనపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు చిత్ర బృందం ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రాబోతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్సీ17’ (RC17). ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా (#RC2Sukku) కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఇటీవలే ఘనంగా జరిగాయి. తాజాగా నటనపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు చిత్ర బృందం ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది.
‘ఆర్సీ17’ క్యాస్టింగ్ కాల్.. ఎవరు అప్లై చేసుకోవచ్చు?
ఈ సినిమా కోసం వివిధ వయసుల నటీనటుల కోసం అన్వేషిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా క్యాస్టింగ్ కాల్ (Casting Call) పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘కొత్త ప్రపంచం.. కొత్త కథ.. బహుశా మీ కోసమే ఓ పాత్ర ఎదురుచూస్తుందేమో’’ అంటూ మేకర్స్ ఈ ఆడిషన్స్‌కు ఆహ్వానం పలికారు. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు ఈ సినిమాలో నటించడానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలుపుతూ ఓ ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.
ఎలా అప్లై చేయాలి? ముఖ్య నిబంధనలు ఇవే!
యాక్టింగ్ టాలెంట్ ఉండి, రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో నటించాలని ఆశపడే వారు తమ పోర్ట్‌ఫోలియో, ఆడిషన్ వివరాలను ఈ కింది మార్గాల ద్వారా పంపించవచ్చు:
ఈమెయిల్ ఐడీ: src17casting@gmail.com
వాట్సాప్ నంబర్: 9110564651
సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే.
ముఖ్య గమనిక: వాట్సాప్ నంబర్‌కు కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్ చేయకూడదు. అలాగే ఆడిషన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపకూడదని చిత్ర బృందం స్పష్టమైన నిబంధనలు విధించింది.
ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ‘ఆర్సీ17’ క్యాస్టింగ్ ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతటి భారీ పాన్-ఇండియా చిత్రంలో నటించే సువర్ణావకాశం రావడంతో.. ఆసక్తిగల నటీనటుల నుంచి భారీ స్పందన లభిస్తోన్నట్లుగా తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం.. మీకు నటన తెలిసి ఉంటే.. మీరూ అప్లయ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
విజయానికి ముందు... ఆ తర్వాత... సాత్విక వీరవల్లి చెప్పిన విశేషాలు
విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్యలు!
దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి