పెళ్లి పేరుతో కోట్లలో మోసం.. నటి అషు రెడ్డిపై ఫిర్యాదు

ABN , Publish Date - Apr 26 , 2026 | 10:18 AM

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడిని పెళ్లి పేరుతో నమ్మించి 9.35 కోట్ల రూపాయలకు మోసం చేసిందంటూ అషు రెడ్డిపై ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Actress Ashu Reddy

అషు రెడ్డి (Ashu Reddy) ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. జూనియర్ సమంతగా అందరూ ఈ భామను వర్ణిస్తుంటారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో ఈ భామ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఎలా వైరలైందో తెలియంది కాదు. అలాగే బిగ్ బాస్‌ (Bigg Boss)తోనూ ఈ నటి మంచి గుర్తింపునే పొందారు. ఆ మధ్య డ్రగ్స్ కేసులో కూడా ఈ భామ పేరు వినిపించింది. ఇంకా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. గ్లామర్ ఫొటోస్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటుంది. అలాంటి అషు రెడ్డిపై ఇప్పుడో వ్యక్తి, లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడిని పెళ్లి పేరుతో నమ్మించి 9.35 కోట్ల రూపాయలకు మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం.. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే..


తన కుమారుడు ధర్మేంద్రను మోసం చేసిందని యనమల సత్యనారాయణ అనే వ్యక్తి నటి అషు రెడ్డిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన చెబుతున్న ప్రకారం.. 2018 నుంచి ప్రేమ, పెళ్లి పేరుతో పలుమార్లు ధర్మేంద్ర దగ్గర డబ్బులు తీసుకుని.. చివరికి పెళ్లి చేసుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతో కారు, బంగారం, పలు ఆస్తులను కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్లుగా చెబుతూ.. మొత్తంగా 9.35 కోట్ల రూపాయలకు అషు రెడ్డి అండ్ ఫ్యామిలీ మోసం చేసినట్లుగా ఆయన ఫిర్యాదులో తెలిపారు. అషు రెడ్డితో పాటు ఆమె సోదరికి సైతం అదనంగా రూ. 50 లక్షలు ఇచ్చినట్టు యనమల సత్యనారాయణ తెలిపారు. దీంతో అషు రెడ్డి, ఆమె ఫ్యామిలీపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి యనమల సత్యనారాయణ చేస్తున్న ఈ ఆరోపణలపై అషు రెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

లెజెండరీ మల్టీస్టారర్‌‌ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Apr 26 , 2026 | 10:58 AM

Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!

Ashu Reddy: నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటున్న ఆషురెడ్డి

Ashu Reddy: దేవుడా.. అషు రెడ్డి అంత‌లా పెంచేసిందేంటి?

Ashu Reddy: ప్రైవేట్ పార్ట్ పై పవన్ టాటూ చూపిస్తూ విష్ చేసిన జూనియర్ సమంత

Ashu Reddy: మ‌ళ్లీ లైన్‌లోకి.. వ‌చ్చిన అషురెడ్డి! నెటిజ‌న్ల‌కు పండ‌గే