సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Danny: రా అండ్ రస్టిక్ చిత్రం ‘డానీ’ రిలీజ్ డేట్ ఖరారు

ABN, Publish Date - Oct 16 , 2026 | 10:57 PM

గతంలో వచ్చిన ‘నాటకం’ చిత్రంతో వైవిధ్యభరితమైన కథాంశాన్ని ఎంచుకుని ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసిన కాంబినేషన్ డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ. వీరి కాంబోలో రానున్న ‘డానీ’ చిత్రానికి రిలీజ్‌ డేట్ ఖరారైంది.

Danny Movie Still

గతంలో వచ్చిన ‘నాటకం’ చిత్రంతో వైవిధ్యభరితమైన కథాంశాన్ని ఎంచుకుని ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసిన కాంబినేషన్ డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ (Kalyanji Gogana), హీరో ఆశిష్ గాంధీ (Ashish Gandhi). ఇప్పుడు వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా చిత్రం ‘డానీ’ (Danny Movie). రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ స్ట్రైక్’ గ్లింప్స్ రా అండ్ రస్టిక్, బోల్డ్ కంటెంట్‌తో ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేశారు.


రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మానసిక సంఘర్షణల నేపథ్యంలో సాగనుంది. జీవితంలో ఓ వ్యక్తికి ఉండే కొన్ని చెడు అలవాట్లు ఏంటి? ఆ అలవాట్లు అతని జీవితాన్ని ఎలాంటి దిగజారుడు స్థితికి తీసుకెళ్లాయి? సరిగ్గా అదే సమయంలో ప్రేమలో పడిన తర్వాత అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరకు ఆ వ్యసనాలకు, ఈ ప్రేమకు మధ్య జరిగిన ఘర్షణలో అతడు ఎలా నిలబడ్డాడు? అనే పచ్చి నిజాలను దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ అత్యంత సహజసిద్ధంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నామని మేకర్స్ తెలుపుతున్నారు.


ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో, హీరోయిన్ల తీరు, పోస్టర్ డిజైన్ వెనుక ఉన్న ఇంటెన్సిటీ కథలోని డెప్త్‌ను, డార్క్‌నెస్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ‘నాటకం’ కాంబో కావడంతో ఈ రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీపై యూత్‌లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలవనుంది. ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

త్వరలోనే థియేటర్లలోకి రాబోతోన్న ‘భగవంతుడు’

యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా.. నిర్మాత రాజ్ అల్లాడ అడుగులు

ఎల్‌నినో.. సీఎం రేవంత్ పిలుపుపై కింగ్ నాగార్జున కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 16 , 2026 | 10:57 PM