సత్యవాన్ సావిత్రి టీజర్.. మరోసారి లాయర్ గా కీర్తి సురేష్

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:01 PM

భాషతో సంబంధం లేకుండా హిట్ కోసం చాలా కష్టపడుతోంది మహానటి కీర్తి సురేష్. ఈమధ్యనే కోలీవుడ్ లో డోరతీ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న కీర్తి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది.

Sathyavan Savithiri

భాషతో సంబంధం లేకుండా హిట్ కోసం చాలా కష్టపడుతోంది మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈమధ్యనే కోలీవుడ్ లో డోరతీ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న కీర్తి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో అక్కా అనే బోల్డ్ సిరీస్ చేస్తోన్న ఆమె తాజాగా నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యవాన్ సావిత్రి (Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డైరెక్టర్ మిస్కిన్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. తాజాగా సత్యవాన్ సావిత్రి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే వాశి సినిమాలో లాయర్ గా మెప్పించిన కీర్తి.. మరోసారి సత్యవాన్ సావిత్రిలో లాయర్ గా కనిపించింది. కథ విషయానికొస్తే.. సావిత్రికి చిన్నప్పటి నుంచి లాయర్ కావాలని కోరిక. ఆ ఆశయంతోనే ఇంట్లో ఒప్పుకోకపోయినా లా చదివి కోర్టులో వచ్చీరాని వాదన చేస్తూ జడ్జిలకు కోపం తెప్పిస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికైనా తనకు ఇన్స్పిరేషన్ అయిన మార్కండేయతో వాదించాలని సావిత్రి చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరికి సావిత్రి కల నెరవేరిందా.. ? మధ్యలో భర్తతో సమస్య ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


సాధారణంగా కోర్టు కేసు చుట్టూ తిరిగే కథలు అంటే కొంతవరకు సీరియస్ గా ఉంటాయి. మొదట చెట్టు కింద ప్లీడర్ లా ఉండే లాయర్.. ఒక పెద్ద కేసు.. పెద్ద లాయర్ తో వారు పోరాటం చేయడం.. చివరకు న్యాయాన్ని గెలిపించడం. ఈ కథ కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తోంది. కాకపోతే టీజర్ లో కేవలం కామెడీ మాత్రమే చూపించి ట్విస్ట్ ని దాచినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమా నవంబర్ 20 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో కీర్తి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 14 , 2026 | 08:02 PM