త్వరలోనే థియేటర్లలోకి రాబోతోన్న ‘భగవంతుడు’

ABN , Publish Date - Oct 16 , 2026 | 10:23 PM

‘మసూద’, ‘పరేషాన్’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తిరువీర్. ఆయన నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ కీలక అప్డేట్ వదిలారు.

Bhagavanthudu Update

‘మసూద’, ‘పరేషాన్’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో తిరువీర్ (Thiruveer).. ‘జాతిరత్నాలు’ ఫేమ్ టాలెంటెడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటిస్తున్న తాజా చిత్రం భగవంతుడు’ (Bhagavanthudu). రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, దర్శకుడు జి.జి. విహారి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. కన్నడ ప్రముఖ నటుడు రిషి ఇందులో ఓ కీలక పాత్రలో మెరవనున్నారు.


రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా విజయవంతంగా పూర్తయింది. పూర్తి విభిన్నమైన కథాంశంతో, పక్కా ప్లానింగ్‌తో చిత్రీకరణను ముగించారు. సినిమా అవుట్‌పుట్ అత్యద్భుతంగా వచ్చిందని, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన ‘భగవంతుడు’ ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు లిరికల్ సాంగ్స్‌.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తిరువీర్ మార్క్ ఇంటెన్స్ నటన, ఫరియా అబ్దుల్లా గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కథలో ఉండే పొలిటికల్ డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ, అధిరే అభి, ‘బలగం’ సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం ఓ సరికొత్త విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా.. నిర్మాత రాజ్ అల్లాడ అడుగులు

ఎల్‌నినో.. సీఎం రేవంత్ పిలుపుపై కింగ్ నాగార్జున కీలక వ్యాఖ్యలు

జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా.. సినిమా టైటిల్ ఇదే

Updated Date - Oct 16 , 2026 | 10:23 PM

విగ్గు ఎందుకు వాడుతున్నారు? అంటే.. నరేష్ ఇచ్చిన సమాధానమిదే

జైలర్‌ 2 రివ్యూ.. సీక్వెల్‌ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్‌!

ధనుష్ అభిమాన సంఘం పేరు మార్పు.. రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చ

MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..

Kalki 2: నాగ్ అశ్విన్ ప్లాన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..