ఎల్‌నినో.. సీఎం రేవంత్ పిలుపుపై కింగ్ నాగార్జున కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:07 PM

పర్యావరణం, సమాజం కోసం ప్రభుత్వం చేపట్టే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ముందుకు రావడానికి మేమే మొదటి వ్యక్తులుగా ఉంటామని అన్నారు కింగ్ నాగార్జున. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ పిలుపుకు ఆయన స్పందించారు.

King Nagarjuna on El nino

కింగ్ అక్కినేని నాగార్జున (King Nagarjuna) కేవలం వెండితెరపై చిత్రాలతో అలరించడమే కాకుండా, సమాజ హితం కోరే సామాజిక అంశాలు, పర్యావరణ పరిరక్షణపై నిత్యం తనదైన గళాన్ని వినిపిస్తూ అవగాహన కల్పిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో (El Nino) ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ‘ఇట్లు అర్జున’ మూవీ మీడియా సమావేశంలో ఓ విలేకరి ఎల్‌నినో అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్న అడిగారు. ‘ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని, ఇది ఏడాదికి పైగా కొనసాగవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రజల్లో చైతన్యం తేవడానికి సినిమా ఇండస్ట్రీని కూడా భాగస్వామ్యం చేయాలని, దసరా తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అవుతానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి?’ అని ప్రశ్నించారు.


దీనికి నాగార్జున స్పందిస్తూ.. ‘‘పర్యావరణం, సమాజం కోసం ప్రభుత్వం చేపట్టే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ముందుకు రావడానికి మేమే మొదటి వ్యక్తులుగా ఉంటాం. ఎల్‌నినో ప్రభావం అనేది కేవలం మన ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదు.. ఇది ప్రపంచం మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీని తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అత్యంత ఆవశ్యకం. ఈ సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. మనం ఇప్పుడే జాగ్రత్తపడకపోతే.. మరో 7, 8 ఏళ్లలో లేదా రాబోయే 10 ఏళ్లలో పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అస్సలు బాగుండదు. అందుకే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారనే నమ్మకం నాకుంది’’ అని నాగార్జున స్పష్టం చేశారు.


‘కింగ్ 100’ పాన్ ఇండియాపై క్లారిటీ:

ఇదే ఇంటరాక్షన్‌లో నాగార్జున తన మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ అయిన ‘కింగ్ 100’ పాన్-ఇండియా స్థాయిలో ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు. ‘‘నా ఫస్ట్ టార్గెట్ ఎప్పుడూ తెలుగు సినిమానే. నేను ఇక్కడి నుంచే పైకి వచ్చాను. ముందే పాన్ ఇండియా అని తలకెక్కించుకుంటే విపరీతమైన కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. ఏ ఆర్టిస్ట్‌ను తీసుకోవాలి, డైలాగ్ ఎలా రాయాలి, మన సంస్కృతి ప్రకారం లుంగీ కట్టుకుంటే పక్క రాష్ట్రాల వాళ్లకు నచ్చుతుందా లేదా అనే అనవసరమైన ఆలోచనలు మైండ్‌లోకి వస్తాయి. కాబట్టి తెలుగు సినిమాను తెలుగు సినిమాగానే తీయాలి. ప్రాజెక్ట్ పూర్తయ్యాక దాన్ని ఎలా రిలీజ్ చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాం’’ అంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా.. సినిమా టైటిల్ ఇదే

‘ఇట్లు నాగార్జున’ అని చాలా ప్రేమలేఖలు రాశా..: కింగ్ నాగార్జున

జాడ లేని ‘ఆదర్శ కుటుంబం’.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా?

Updated Date - Oct 16 , 2026 | 08:07 PM

King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను

King Nagarjuna: మేం ఆస్కార్ వరకు వెళ్లాం.. సినీ పరిశ్రమకు రాజధాని హైదరాబాదే..

King Nagarjuna: నాగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4కె‌లో ఆ సినిమా రీ రిలీజ్!

King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?