రాజుగారి ఆతిధ్యం లిస్ట్ లో మరో హీరోయిన్
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:47 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కేవలం తన నటనతోనే కాకుండా, తనదైన మంచితనంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కేవలం తన నటనతోనే కాకుండా, తనదైన మంచితనంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా తోటి నటీనటులకు, తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఆయన అందించే ఆతిథ్యం గురించి టాలీవుడ్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. షూటింగ్ సెట్స్‌లో అందరికీ రుచికరమైన, ఘుమఘుమలాడే రకరకాల వంటకాలను రుచి చూపించడం ప్రభాస్‌కు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఇప్పటివరకు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ప్రభాస్ పంపిన ఫుడ్‌కు ఫిదా అయ్యామని, ఆయన వంటి మనసున్న వ్యక్తిని ఎక్కడా చూడలేదని పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రశంసించారు.
తాజాగా ఈ కోవలోనే ప్రభాస్ నుంచి అరుదైన గౌరవం అందుకుంది యంగ్ బ్యూటీ ఇమాన్వి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇమాన్వి పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్.. హైదరాబాద్ సెట్స్‌కు ఒక భారీ విందును పంపించి సర్ప్రైజ్ చేశారు. రకరకాల రుచికరమైన వంటకాలతో నిండిన ఆ టేబుల్ ఫోటోలను చూసి ఇమాన్వి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ పంపిన ఆ రుచికరమైన భోజనానికి తాను పూర్తిగా ఫిదా అయిపోయానని, ఆయన చూపించిన ఈ ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ తనకు స్వయంగా భోజనం పంపి సర్ప్రైజ్ చేయడం తన కెరీర్లోనే ఒక అపురూపమైన క్షణమని ఆమె పేర్కొన్నారు. ఆ ఫుడ్ తో పొట్టతో పాటు హృదయం కూడా నిండిపోయిందని ఇమాన్వి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇమాన్వి బర్త్‌డేకు ప్రభాస్ పంపిన ఈ ఫుడ్ ట్రీట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు రాజుగారి ఆతిధ్యం అంటే ఏమనుకున్నారు.. డార్లింగ్ ఫుడ్ తోనే చంపేస్తాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సందీప్ కిషన్ ‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్.. రెండు భాగాలుగా పాన్ ఇండియా మూవీ
Jailer 2: సంతానం సీన్లన్నీ ఔట్.. విజయ్ సేతుపతి పాత్ర ‘జైలర్ 3’కి లీడ్..