సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కథలు వినడం మానేసిన అనుపమ.. కారణం ఏంటి?

ABN, Publish Date - Oct 29 , 2026 | 06:23 PM

టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ భామ కథలు వినడం మానేసినట్లుగా ప్రకటించి షాకిచ్చారు.

Anupama Parameswaran

టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల కొత్త సినిమాల కథలు వినడం తాత్కాలికంగా ఆపేసినట్లుగా తెలిపారు. ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్న సమయంలో కథలు వినడం మానేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

కొత్త కథలు వినకపోవడానికి ప్రధాన కారణం ఆమె ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులే. అనుపమ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటికే అంగీకరించిన సినిమాలను ఎటువంటి ఆటంకం లేకుండా ముందుగా పూర్తి చేయాలనుకుంటున్నాను. నా వల్ల ఏ దర్శకుడు కూడా ఎదురుచూస్తూ కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సమయం గడిచేకొద్దీ ఆలోచనలు, పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అనవసరమైన ఆలస్యాలు జరగకుండా, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసమే కొత్త స్క్రిప్ట్‌లు వినడం తాత్కాలికంగా నిలిపివేశాను’’ అని స్పష్టం చేశారు.


చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ

ప్రస్తుతం ఆమె వివిధ భాషల్లో భారీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.. తెలుగులో ఇప్పటికే ఒక సినిమాకు సంతకం చేసిన ఆమె.. తమిళంలో ఒక సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. మరో రెండు తమిళ ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. మలయాళంలో కూడా ఏకంగా మూడు చిత్రాలను ఆమె లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటితో పాటు త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన ప్రస్తుత షెడ్యూల్స్ ముగిశాక బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెడతానని అనుపమ వెల్లడించారు.


కేవలం డబ్బు కోసమే సినిమాలు చేయను

సినిమాల ఎంపిక విషయంలో తనకంటూ కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయని అనుపమ పేర్కొన్నారు. ‘‘కేవలం డబ్బు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో నేను ఎప్పుడూ సినిమాలు ఒప్పుకోను. నాకు నటనపై ప్యాషన్, కొత్త పాత్రలు చేయాలనే తపన ఉండాలి. నా పనిని నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి. ఒకే తరహా పాత్రలను మళ్లీ మళ్లీ చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే నటిగా ఒకే పరిధిలో ఇరుక్కుపోకుండా నన్ను నేను నిరూపించుకోవడానికి ‘టిల్లు స్క్వేర్, పరదా, క్రేజీ కళ్యాణం’ వంటి విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకున్నాను’’ అని వివరించారు. అలాగే గతంలో మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం తనకు సినిమాను అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’ వాయిదా వార్తలకు విజయేంద్ర ప్రసాద్ చెక్

కమర్షియల్ బాటలో పీపుల్స్ స్టార్.. మూర్తి గారూ మీరు మారిపోయారు సార్

‘మెగావర్స్’ మొదటి లుక్ వచ్చేసింది..

Updated Date - Oct 29 , 2026 | 06:23 PM