Anupama Parameshwaran: ఇదేంటి ఇలా షాకిచ్చింది, వైరల్ అవుతున్న ఫోటోస్!

ABN , First Publish Date - 2023-08-22T13:34:29+05:30 IST

సాంఘీక మాధ్యమంలో ఎక్కువమంది ఫాలోవర్స్ వున్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఆమె ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉంటూ, తన గురించి సమాచారం, అలాగే తన ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మంచి టాలెంట్ వున్న నటి యైన అనుపమ ఈసారి అభిమానులకి షాకిచ్చింది.

Anupama Parameshwaran: ఇదేంటి ఇలా షాకిచ్చింది, వైరల్ అవుతున్న ఫోటోస్!
Anupama Parameshwaran

మలయాళంలో 'ప్రేమమ్' #Premam అనే సినిమాతో ఒక కొత్త యువ కథానాయకి అనుపమ పరమేశ్వరన్ (AnupamaParameshwaran) అనే ఆమె పరిచయం అయింది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దర్శకత్వం వహించిన 'అ.. ఆ.. ' #A.Aa అనే సినిమాతో పరిచయం అయిన అనుపమ, తన మొదటి సినిమాతో ఒక మంచి టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకుంది. తెలుగు కూడా బాగానే నేర్చుకొని, మొదటి సినిమాలో తన వాయిస్ కి తనే డబ్బింగ్ చెప్పుకొని ఆ సినిమాతో తన కెరీర్ పట్ల డెడికేషన్, సినిమా అంటే ఎంత పేషన్ అనేది అనుపమ తేలియచేసింది.

anupamaparameshwaran2.jpg

అయితే అనుపమ మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది, గొప్ప టాలెంట్ వున్న నటి అని కూడా అనిపించుకుంది, కానీ ఎందుకో మరి పెద్ద నటులతో చేసే అవకాశాం మాత్రం రావటం లేదు అనుపమకి. ఆమధ్య నిఖిల్ సిద్ధార్థ్ (NikhilSiddhartha) తో చేసిన 'కార్తికేయ 2' #Karthikeya2 పెద్ద హిట్ అయింది, పాన్ ఇండియా లెవెల్లో కూడా బాగా ఆడింది.

anupamaparameshwaran3.jpg

ఆ తరువాత '18 పేజెస్' #18Pages అనే ఇంకో సినిమా కూడా విడుదలైంది. ఇందులో అనుపమ నటనతో అందరినీ మెప్పించింది. అసలు ఈ సినిమాలోనే కాదు, ఆమె ఏ సినిమాలో చేసినా ఆమెకి నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. ఆ సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అనుపమ తన ప్రతిభని ప్రతి సినిమాలోనూ కనపరుస్తూ ఉంటుంది.

ఈమధ్య విడుదలైన 'బట్టర్ ఫ్లై' #Butterfly అనే సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలైంది. అయితే ఈ సినిమా క్రిటిక్స్ అంతగా నచ్చినట్టు కనపడలేదు. అలాగే రామ్ చరణ్ (RamCharan) తో అప్పట్లో 'రంగస్థలం' #Ranghasthalam లో ముందు అనుపమ నే కథానాయిక అనుకున్నారు, కానీ మళ్ళీ ఏమయిందో కానీ సమంత (Samantha) ని తీసుకున్నారు.

anupamaparameshwaran4.jpg

ఇలా పెద్ద సినిమాలు రాకపోయినా అనుపమ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' #TilluSquare అనే సినిమా సిద్దు జొన్నలగెడ్డ (SiddhuJonnalagadda) పక్కన చేస్తోంది. ఇది 'డీజే టిల్లు' #DJTillu అనే సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. సిద్ధూ సినిమా అనగానే అతన్ని తెలుగు ఇమ్రాన్ హష్మీ (EmraanHashmi) అని అంటున్నారు.

anupamaparameshwaran5.jpg

ఇప్పుడు అదే సిద్దు తో అనుపమ ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదలైంది. ఆ పాట అప్పుడే వైరల్ కూడా అయింది. అందులో అనుపమ చాలా గ్లామర్ గా కూడా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అనుపమ ని ఇంతకు ముందు ఆమె చేసిన సినిమాల కన్నా ఒక వెరైటీ పాత్రలో చూడొచ్చు అని అంటున్నారు. అలాగే ఆమె గ్లామర్ గా కూడా ఈ సినిమాలో కనిపించనుంది అని కూడా అంటున్నారు.

anupamaparameshwaran6.jpg

ఇదిలా ఉంటే, అనుపమ ఎప్పుడూ సాంఘీక మాధ్యమంలో ఆక్టివ్ గా ఉంటూ ఉంటుంది. తన ఫోటోస్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ, తన అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది. 'టిల్లు స్క్వేర్' సినిమా సాంగ్ విడుదలైనప్పుడు అభిమానులు ఆమె మీద కొంచెం కోపంగా కామెంట్స్ పెట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె సాంఘీక మాధ్యమంలో పెట్టిన గ్లామర్ పిక్స్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఏంటి అనుపమ నేనా ఈ ఫోటోస్ పెట్టింది అని ఆశ్చర్యపోతున్నారు !

Updated Date - 2023-08-22T13:36:29+05:30 IST