‘వారణాసి’ వాయిదా వార్తలకు విజయేంద్ర ప్రసాద్ చెక్
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:17 PM
‘వారణాసి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో ముందుగా అనుకున్న తేదీకి రాకుండా సినిమా వాయిదా పడుతుందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ విజువల్ వండర్ ‘వారణాసి’ (Varanasi). షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో ముందుగా అనుకున్న తేదీకి రాకుండా సినిమా వాయిదా పడుతుందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారానికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ (V. Vijayendra Prasad) తెరదించారు. తాజాగా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ (Dad's Little Friend) చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్‌ను ‘వారణాసి’ అప్‌డేట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. సినిమా విడుదల వాయిదా పడుతోందా అని అడగ్గా ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు.
‘‘నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కదా.. వచ్చే ఏడాది 7 ఏప్రిల్, 2027న ‘వారణాసి’ తప్పనిసరిగా థియేటర్లలోకి వస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ తేల్చి చెప్పారు. ఆ రిలీజ్ డేట్ పక్కాగా కన్ఫర్మ్ యేనా అని యాంకర్ మళ్లీ అడగ్గా.. ‘‘అవును, కచ్చితంగా ఆ రోజే విడుదలవుతుంది.. డేట్ కన్ఫర్మ్’’ అంటూ విజయేంద్ర ప్రసాద్ పునరుద్ఘాటించారు. స్వయంగా కథా రచయితే రిలీజ్ డేట్‌పై పక్కా క్లారిటీ ఇవ్వడంతో, వాయిదా పడుతుందంటూ వస్తున్న రూమర్లన్నింటికీ ఒక్కసారిగా పుల్‌స్టాప్ పడినట్లయింది.
రాజమౌళి సినిమా అంటే గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ కోసం ఆలస్యం కావడం సహజమని భావించిన ప్రేక్షకులకు.. చెప్పిన తేదీకే ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందని తెలియడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వాస్తవానికి ‘బాహుబలి, ట్రిపుల్ ఆర్’ వంటి విజువల్ వండర్స్‌ను తెరకెక్కించిన అనుభవం ‘వారణాసి’ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ వర్క్‌కు ఎంతగానో ఉపయోగపడిందని రాజమౌళి ఇప్పటికే షేర్ చేసుకున్నారు. కంటెంట్ పరంగా, విజువల్ గ్రాండియర్ పరంగా, క్రేజ్ పరంగా కూడా ‘ట్రిపుల్ ఆర్’ కంటే ‘వారణాసి’ ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండబోతోందని రాజమౌళి అంతర్జాతీయ వేదికలపై చెబుతున్నారు. మరి అంతగా ప్రమోట్ చేస్తూ.. మళ్లీ వాయిదా పడుతుంటే.. నమ్మశక్యంగా లేదు. అదే విషయాన్ని ఇప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా క్లారిటీ ఇవ్వడంతో.. అనుకున్న టైమ్‌కే ‘వారణాసి’ థియేటర్లలో సందడి చేయనుందని ఫిక్స్ అయిపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
కమర్షియల్ బాటలో పీపుల్స్ స్టార్.. మూర్తి గారూ మీరు మారిపోయారు సార్
‘మెగావర్స్’ మొదటి లుక్ వచ్చేసింది..
ఇమ్ము, శ్రీ సత్యల ‘డెస్టినీ’కి అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే?