Anupama : ఇది నా ఫేవరేట్ చిత్రం
ABN , First Publish Date - 2022-12-22T04:50:39+05:30 IST
‘ఇప్పటిదాకా నేను నటించిన ప్రేమకథా చిత్రాల్లో ‘18 పేజేస్’ నాకు బాగా నచ్చింది. ఇందులో నందిని అనే సాధారణ యువతి పాత్రలో నటించాను...

‘ఇప్పటిదాకా నేను నటించిన ప్రేమకథా చిత్రాల్లో ‘18 పేజేస్’ నాకు బాగా నచ్చింది. ఇందులో నందిని అనే సాధారణ యువతి పాత్రలో నటించాను. సినిమాలో నా పాత్ర, కథ అందరికీ నచ్చుతుంది’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. నిఖిల్ సిద్దార్థకు జోడీగా ఆమె నటించిన చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. సూర్యప్రతాప్ దర్శకుడు. ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనుపమ చెప్పిన సినిమా విశేషాలు
2020 లాక్‌డౌన్‌లో సూర్యప్రతాప్ ఈ కథ చెప్పారు. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించి వెంటనే ఒప్పుకొన్నాను. ‘18 పేజెస్’ అనేది క్రేజీ లవ్‌స్టోరీ. నా మనసుకు దగ్గరైన చిత్రం ఇది. సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండే యువతి పాత్రలో నటించాను. ఇలాంటివాళ్లు కూడా ఇంకా ఉన్నారా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
‘18 పేజెస్’ తర్వాతే ‘కార్తికేయ 2’ చిత్రం అంగీకరించాను. నిఖిల్‌తో ఒకేసారి రెండు సినిమాల ప్రయాణం సంతోషంగా ఉంది. షూటింగ్స్ సమాంతరంగా సాగాయి. ‘కార్తికేయ 2’ పెద్ద హిట్ అవ్వడంతో మా జంటకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘18 పేజె్‌స’తో మళ్లీ సక్సెస్ కొడతామనే నమ్మకం ఉంది.
రిలేషన్‌షి్‌పలో కొన్ని అంచనాలతో ముందుకు వెళితే అది అరేంజ్డ్ లవ్ అవుతుంది. మనకు తెలియకుండానే ఒకరితో ప్రేమలో పడతాం. ‘ప్రేమించడానికి కారణం అంటూ ఉండదు, ఎందుకు ప్రేమిస్తున్నావంటే దానికి ఆన్సరుండదు’ అనే డైలాగ్ సినిమాలో సారాంశాన్ని చెబుతుంది.
సుకుమార్ గారి ‘రంగస్థలం’ చిత్రంలో చేసే అవకాశం వచ్చినా వీలుకాలేదు. ఆ లోటును తీర్చేలా ఈ సినిమాలో ఆయన నా పాత్రను తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. అల్లు అరవింద్‌గారు నన్ను కూతురులా చూసుకుంటారు. నాలాంటి కూతురు ఉంటే బాగుండేది అని అనడం నాకు ఆయన ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తాను.
దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉంది. కానీ ముందు శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ‘మరీచిక’, ‘ఈగల్’, ‘సైరన్’ చిత్రాల్లో నటిస్తున్నాను.