కమర్షియల్ బాటలో పీపుల్స్ స్టార్.. మూర్తి గారూ మీరు మారిపోయారు సార్

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:39 PM

నాలుగు దశాబ్దాలుగా ఎర్రజెండా నీడన, ప్రజా సమస్యల నేపథ్యంతోనే సినిమాలు తీస్తూ.. ‘పీపుల్స్ స్టార్’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఆర్. నారాయణమూర్తి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.

R Narayana Murthy

నాలుగు దశాబ్దాలుగా ఎర్రజెండా నీడన, ప్రజా సమస్యల నేపథ్యంతోనే సినిమాలు తీస్తూ.. ‘పీపుల్స్ స్టార్’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy). సిద్ధాంతాల కోసం రాజీలేని పోరాటం చేస్తూ, గతంలో అగ్ర దర్శకులు బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేసినా కమర్షియల్ సినిమాల్లో నటనకు సున్నితంగా ‘నో’ చెప్పిన చరిత్ర ఆయనది. అలాంటి సిద్ధాంతాల నాయకుడు ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. పూర్తి యూత్‌ఫుల్, రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హుషారు 2’ (Husharu 2)లో ఆయన ఓ కీలకమైన నక్సలైట్ స్పెషల్ రోల్ చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాలను, ప్రేక్షకులను ఒక్కసారిగా విస్మయానికి గురిచేస్తోంది.


గత కొన్నేళ్లుగా ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో వస్తున్న విప్లవ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. మారిన ప్రేక్షకుల అభిరుచి, మారుతున్న సినిమా ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కెరీర్‌కు మళ్లీ సరికొత్త ఊపునిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన రోల్ కనుక క్లిక్ అయితే, భవిష్యత్తులో స్టార్ హీరోల పాన్-ఇండియా చిత్రాల్లోనూ పవర్‌ఫుల్ పాత్రల్లో మూర్తిగారిని చూడొచ్చని, సరికొత్త అరుదైన కాంబినేషన్లకు ఇది నాంది పలుకుతుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.


అయితే, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో మరో వైపు హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘టెంపర్’ (Temper) చిత్రంలో పోసాని కృష్ణమురళి పోషించిన హోంగార్డు నారాయణమూర్తి పాత్ర కోసం పూరి తొలుత ఆర్. నారాయణమూర్తినే సంప్రదించారు. అయితే ఆ సమయంలో ‘నా సినిమాలేవో నేను సొంతంగా చేసుకుంటాను.. వేరే వాళ్ల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయను’ అంటూ ఆయన కరాఖండీగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు పూర్తి జాలీ యూత్ ఎంటర్‌టైనర్ అయిన ‘హుషారు 2’లో నటించడానికి ఎలా ఒప్పుకున్నారంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ‘టెంపర్’ సినిమాలో పోసాని చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. ‘మీరు మారిపోయారు సార్!’ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తుండటం విశేషం. ఏదేమైనా, ఎప్పుడూ రొటీన్‌కు భిన్నంగా ఉండే పీపుల్స్ స్టార్.. వెండితెరపై యువతరంతో కలిసి ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘మెగావర్స్’ మొదటి లుక్ వచ్చేసింది..

ఇమ్ము, శ్రీ సత్యల ‘డెస్టినీ’కి అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే?

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత

Updated Date - Oct 29 , 2026 | 04:39 PM

R Narayan Murthy: పవన్‌ కల్యాణ్‌ అలా అనకుండా ఉంటేబావుండేది..

R Narayana Murthy: యూనివర్సిటీ చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు

R Narayana Murthy: పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తికి స్వల్ప అస్వస్థత

R Narayana Murthy: మాకు అవమానం జరగలేదు...

R Narayanamurthy: అండగా ఉంటామని భరోసా