‘మెగావర్స్’ మొదటి లుక్ వచ్చేసింది..

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:59 PM

దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

MegaVerse First Look

మెగాస్టార్ చిరంజీవి లెగసీలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ‘మెగావర్స్’ పేరుతో రూపొందుతున్న ఈ షో ద్వారా ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ ఎంట్రీకి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలే కానీ, అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ‘మెగావర్స్’ (MegaVerse)ని కన్ఫర్మ్ చేస్తూ.. మేకర్స్ అధికారిక ప్రకటనతో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ప్రసారం కానున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనుభవం ఉన్న చిరంజీవి.. ఈ షోలో తన జర్నీకి సంబంధించిన అనేక విషయాలను పంచుకోనున్నారని తెలుస్తోంది. అలాగే ఆసక్తికరమైన సంభాషణలతో.. అద్భుతమైన కథలు చెబుతూ.. ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణతో ఈ షో ఉంటుందని ‘మెగావర్స్’ టీమ్ చెబుతోంది.


‘మెగావర్స్’లో ప్రేక్షకులతో తరతరాలుగా ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్న చిరంజీవి.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విభిన్న తరాలకు చెందిన స్టార్స్‌తో ముచ్చటించనున్నారు. తన సహజమైన ఆత్మీయత, సందర్భానికి తగ్గట్టుగా స్పందించే ప్రత్యేకమైన శైలి, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ వేదికపై ఆయన సందడి చేయనున్నారు. భారతీయ సినిమా లెగసీని సెలబ్రేట్ చేస్తూ, ‘మెగావర్స్’ ద్వారా ప్రేక్షకులు అభిమానించే దిగ్గజాల జీవితాలు, వారి ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను మరింత సన్నిహితంగా పరిచయం చేయనుంది. ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా.. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, SOL ప్రొడక్షన్ LLP సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ప్రీ లుక్ మాత్రం సెన్షేషన్‌గా దూసుకెళుతోంది.

ఇవి కూడా చదవండి:

ఇమ్ము, శ్రీ సత్యల ‘డెస్టినీ’కి అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే?

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత

‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే

Updated Date - Oct 29 , 2026 | 04:08 PM

Chiranjeevi - Bobby: బాస్‌.. బాబీ.. సెట్స్‌ మీదకు వెళ్లడమే తరువాయి..

Chiranjeevi - Modi: తమ్ముడి స్వాగతోత్సవంలాగే మోదీజీతో సంభాషణ కూడా కలకాలం గుర్తుండి పోతుంది!

మెగావర్స్.. చిరు వర్సెస్ కమల్.. ఇది కదా కావాల్సింది

విశ్వంభర.. వచ్చేది అప్పుడేనా

Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్‌..