Akhil Akkineni: అయ్యగారు.. లెనిన్ సంగతేంటి
ABN , Publish Date - May 22 , 2026 | 07:01 PM
ఏజెంట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
ఏజెంట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదట ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ అదే సమయానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా రేసులోకి రావడంతో, అనవసరమైన బాక్సాఫీస్ క్లాష్ వద్దనుకుని జూన్ 26 కి వాయిదా పడింది.
ఇక నాగార్జున స్వయంగా ఈ సినిమా ఫస్ట్ కట్ చూసి, సినిమా అవుట్‌పుట్ చాలా బావుందని, ఎంతో గర్వంగా, నమ్మకంగా ఉన్నట్లు చెప్పడంతో అయ్యగారు ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతే కాకుండా మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఇది అతని కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. అయితే లెనిన్ రిలీజ్ ఇంకా నెల కూడా లేదు. ఇప్పటివరకు మేకర్స్ ఒక్క ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా లెనిన్ ఈసారి కూడా వాయిదా పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్ షూటింగ్ ఇంకా ఫినిష్ కాలేదని తెలుస్తోంది. అందుకే ప్రమోషన్స్ వేగవంతం చేయలేదని సమాచారం. ఈ వార్తా తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అఖిల్ సినిమాకు ఇప్పుడు ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అయ్యగారి సినిమాకు హైప్ వస్తుంది. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. చివరి నిమిషంలో ప్రమోషన్స్ అంటే అయ్యగారికి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడైనా మేకర్స్ ఈ విషయాన్ని గుర్తించి కొంచెం సౌండ్ పెంచితే బావుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి లెనిన్ మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ తో వస్తారో చూడాలి.