రాకీ బాయ్‌కి ‘టాక్సిక్’ వర్కవుట్‌ అవుతుందా?

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:15 PM

కెజియఫ్.. ఈ ఒక్క పేరుతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రాకీ బాయ్‌గా యశ్‌ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. యశ్ అనే పేరును పాన్ ఇండియా లెవల్‌లో మారుమోగేలా చేసిన ఆ సిరీస్ సినిమాల తర్వాత మరో మూవీ ఆయన చేయలేదు. ఈ క్రమంలో ఆయన నుంచి సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతుంది.

Yash Toxic Update

కెజియఫ్.. ఈ ఒక్క పేరుతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రాకీ బాయ్‌గా యశ్‌ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. యశ్ అనే పేరును పాన్ ఇండియా లెవల్‌లో మారుమోగేలా చేసిన ఆ సిరీస్ సినిమాల తర్వాత మరో మూవీ ఆయన చేయలేదు. ఈ క్రమంలో ఆయన నుంచి సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతుంది. యశ్‌ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించేలా ఈ ఏడాది రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ యశ్ రాబోతున్నారు. ఇందులో మొదటిది ‘టాక్సిక్‌’, రెండోది ‘రామాయణ’.


సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే.. హీరోలు వెంట వెంటనే ప్రాజెక్టులు సైన్ చేస్తారు. కానీ యశ్ (Yash) రూటే వేరు. కెజియఫ్ 2 (KGF 2) తర్వాత తను చేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana)లో రావణుడిగా ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తూనే.. కన్నడ ఇండస్ట్రీ గర్వపడేలా ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాను పట్టాలెక్కించారు. గీతూ మోహన్ దాస్ లాంటి నేషనల్ అవార్డ్ విన్నర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. షూటింగ్ పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ జరుగుతోంది. ఇప్పటి వరకు ‘టాక్సిక్’ అంటే ఒక డ్రగ్ మాఫియా కథ అని, లేదా ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టారు యశ్. లాస్ వెగాస్‌లో జరిగిన ప్రెస్టీజియస్ సినిమాకాన్ 2026 వేదికపై యశ్ స్వయంగా ఈ సినిమా ప్లాట్ గురించి నోరు విప్పారు. ఈ సినిమా కథ 1940ల నాటి గోవా నేపథ్యంలో సాగుతుంది. అది గోవాపై పోర్చుగీస్ పాలన సాగుతున్న కాలం. అప్పటి పరిస్థితుల్లో ఒక తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ అండ్ రివెంజ్ డ్రామానే ఈ ‘టాక్సిక్’. స్వాతంత్ర్య కాంక్షతో పాటు, కుటుంబం కోసం సాగించే పోరాటం ఇందులో హైలైట్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అన్నింటికీ యశ్ ఈ అప్‌డేట్‌తో గట్టి సమాధానమే ఇచ్చారు.


తండ్రీకొడుకుల రివెంజ్ డ్రామా తరహా స్టోరీతో ఇండియన్‌ బాక్సాపీస్‌ పై కొన్ని వేల సినిమాలు వచ్చాయి. అందులో హిట్‌ అయినవి ఉన్నాయి, ఫ్లాప్‌ అయినవి ఉన్నాయి. మరి ‘టాక్సిక్‌’లో ఉన్న కొత్తదనం ఏంటి..? రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా గీతూ మోహన్ దాస్ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనే విషయం తెలియంది కాదు. పాత కాలపు గోవా సెట్టింగ్స్, అప్పటి పోర్చుగీస్ ఆయుధాలు, కల్చర్, యశ్‌ పెర్ఫామెన్స్‌.. టాక్సిక్‌కు హైలెట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. యశ్ తన స్టైల్ మార్చి ఒక రా అండ్ రస్టిక్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Updated Date - Apr 18 , 2026 | 05:15 PM

TOXIC: టాక్సిక్.. గంగ! న‌య‌న‌తార‌.. ఫ‌స్ట్‌ లుక్ అదిరింది

Toxic : అందుకే ఆంగ్లంలో కూడా..

Toxic Raya: య‌శ్‌.. ఏంటి ఈ చండాలం! ఎలివేష‌న్‌కు.. ఇంకో సీనే దొర‌క‌లేదా

Toxic Movie: చిక్కుల్లో యశ్‌ టాక్సిక్‌.. విడుదల డౌటే

Toxic: కుర్రకారుని కిర్రెక్కించే పాత్రలో కియారా