TOXIC: టాక్సిక్.. గంగ! న‌య‌న‌తార‌.. ఫ‌స్ట్‌ లుక్ అదిరింది

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:17 PM

కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత రాకింగ్ స్టార్ య‌శ్ (Yash) హీరోగా న‌టిస్తోన్న చిత్రం టాక్సిక్.

TOXIC

కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత రాకింగ్ స్టార్ య‌శ్ (Yash) హీరోగా న‌టిస్తోన్న చిత్రం టాక్సిక్ (TOXIC The Movie). గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani), హుమా ఖురేషి (Huma Qureshi), న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు రానుంది.

TOXIC

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టి నుంచే ఒక్కో అప్డేట్ ఇస్తూ స‌ర్‌ఫ్రైజ్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు కియారా, హుమూ ఖురేషి లుక్స్ రిలీజ్ చేసిన మేక‌ర్స్ తాజాగా న‌య‌న‌తార పాత్ర‌కు సంబంధ‌ఙంచిన గంగ పాత్ర లుక్ విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో న‌య‌న తార బ్లాక్ డ్రెస్‌లో పొడ‌వాటి గ‌న్ ప‌ట్టుకుని స్ట‌న్నింగ్‌గా అదిరిపోయేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ లుక్ సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

Updated Date - Dec 31 , 2025 | 12:37 PM