Toxic Raya: య‌శ్‌.. ఏంటి ఈ చండాలం! ఎలివేష‌న్‌కు.. ఇంకో సీనే దొర‌క‌లేదా

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:08 PM

క‌న్న‌డ రాకింగ్‌ స్టార్ య‌ష్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ చిత్రం టాక్సిక్ నుంచి య‌శ్ ఫ‌స్ట్ లుక్ గ్లింప్స్ వ‌చ్చేసింది.

Toxic Raya

క‌న్న‌డ రాకింగ్‌ స్టార్ య‌ష్ (Rocking Star Yash) హీరోగా తెర‌కెక్కుతున్న‌ చిత్రం టాక్సిక్ (Toxic Movie). కియారా అద్వానీ, న‌య‌న‌తార (Nayanthara), రుక్మ‌ణీ వ‌సంత్ (Rukmini Vasanth), హుమా ఖురేషి (Huma Qureshi), తార సుతారియా (Tara Sutaria) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతూ మోహ‌న్ దాస్ (Geetu Mohandas|) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈచిత్రం మార్చి 19న విడుద‌ల కానుంది. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రంలో న‌టిస్తున్న ప్ర‌ధాన‌ తార‌ల ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేస్తూ వ‌చ్చిన మేక‌ర్స్ తాజాగా గురువారం హీరో య‌శ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆయ‌న పాత్ర ర‌యాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన క్ష‌ణాల్లోనే మిలియ‌న్ల కొల‌ది వ్యూస్ రాబ‌డుతూ స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పుతుంది.

TOXIC

ఇక ఈ రోజు విడుద‌ల చేసిన వీడియో విష‌యంలో ఫ్యాన్స్ సెల‌బ్రేట్ చేసుకుంటుండ‌గా, సినీ ల‌వ‌ర్స్, స‌గ‌టు ప్రేక్ష‌కుల నుంచి మాత్రం మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఓ విదేశంలోని స్మ‌శాన వాటిక‌లో ఓ చిన్న ఫ్యామిలీ త‌మ కుటుంబ స‌భ్యుడికి అంత్య‌క్రియ‌లు చేస్తుండ‌డం, అదే స‌మ‌యంలో ఓ విల‌న్ గ్యాంగ్ వ‌చ్చి వారిని హింసించి కిడ్నాప్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. స‌రిగ్గా అప్పుడే ఓ ఖ‌రీదైన కారులో హీరో రావ‌డం, వ‌స్తు వ‌స్తూనే కారులోనే అమ్మాయితో ఘాటైన‌ ప‌నిలో బిజీగా ఉండి విల‌న్ గ్యాంగ్‌పై బాంబు పేల్చ‌డం, ఆ వెంట‌నే హీరో కారు దిగి డైలాగులు చెప్పి, యాక్ష‌న్ మోడ్‌లోకి రావ‌డం ఈ వీడియోలో ఉంది.

TOXIC

అయితే.. ఈ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఇత‌రుల‌కు మాత్ర జుగుప్సాక‌రంగా అనిపించింది. అంత‌పెద్ద స్టార్ హీరో అయి ఉండి అయ‌న ఎలివేష‌న్‌కు అలాంటి సీన్ త‌ప్పితే మ‌రోటి దొర‌క‌లేదా, అస‌లు యూత్‌కు ఎలాంటి మెసేజ్ ఇద్దామ‌ని ఇలాంటి దృశ్యాలు పెడ‌తారు అంటూ నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. అందులో ఆ కారు స‌న్నివేశం తొల‌గించి ఉంటే బావుండేది క‌దా, దానితో హీరోకు ఎలివేష‌న్ ఏంటి చండాలంగా ఆ సీన్ వ‌ర‌కు లేకున్నా హీరో ఎలివేష‌న్ గ‌ట్టిగానే ఉంది క‌దా అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అంతేగాక ఓ లేడీ డైరెక్ట‌ర్ అయి ఉండి ఇలాంటి స‌న్నివేశం ఎలా తీయ‌గ‌లిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి

Anasuya Bharadwaj: దిగొచ్చిన అన‌సూయ‌..

Jr. NTR: వీడియోగ్రాఫర్‌పై.. ఎన్టీఆర్ సీరియ‌స్‌! వీడియో వైరల్

Updated Date - Jan 08 , 2026 | 08:29 PM