Toxic : అందుకే ఆంగ్లంలో కూడా..

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:36 AM

భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా సమాంతరంగా షూటింగ్‌ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్‌.’ ఇలా ఆంగ్లంలో చిత్రీకరిస్తున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం...

భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా సమాంతరంగా షూటింగ్‌ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్‌.’ ఇలా ఆంగ్లంలో చిత్రీకరిస్తున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. కన్నడ చిత్ర కథానాయకుడు యశ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గీతూ మోహన్‌దా్‌స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలతో వస్తున్న మా చిత్రాన్ని అన్ని భాషలు, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం. అన్ని సరిహద్దుల్ని ‘టాక్సిక్‌’ చెరిపేస్తుందని భావిస్తున్నాం’ అన్నారు. ‘టాక్సిక్‌’ చిత్రం షూటింగ్‌ గత ఏడాది ఆగస్టులో మొదలైంది. ఇప్పటివరకూ ఇండియన్‌ హిస్టరీలోనే అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. హాలీవుడ్‌ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్‌ కె నారాయణ మాట్లాడుతూ ‘మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించే చిత్రంగా ‘టాక్సిక్‌’ను రూపొందిస్తున్నాం’ అన్నారు.


ఇవి కూడా చదవండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 05:36 AM