నమ్రత, స్నేహారెడ్డిలతో కలిసి ఉపాసన దీవాళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Nov 09 , 2026 | 03:20 PM

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు, బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం స్టార్ హీరోల భార్యలు వార్తల్లో నిలిచారు.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు, బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం స్టార్ హీరోల భార్యలు వార్తల్లో నిలిచారు. దీపావళి పండుగ సందర్భంగా మెగా, అల్లు, ఘట్టమనేని కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఒకే చోట సందడి చేశారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 

fetch (1).jfif

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. మహిళలు మాత్రమే పాల్గొన్న ఈ ప్రత్యేక గెట్‌టుగెదర్‌లో పలువురు సన్నిహితులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు పాల్గొని పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబైన వీరంతా వేడుకలో సందడి చేశారు.ముఖ్యంగా ఉపాసన ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా, స్నేహా రెడ్డి నలుపు రంగు దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

aaa.jpg

మరో ఫొటోలో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఉపాసన తన స్నేహితులతో కనిపించారు. ఈ ముగ్గురు స్టార్ హీరోల భార్యలు ఒకే వేడుకలో కనిపించడంతో అభిమానులు ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.  సాధారణంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు తమ సినిమాలు, షూటింగులతో బిజీగా ఉంటారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా తమ వ్యక్తిగత, వ్యాపార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటి సమయంలో పండుగ సందర్భంగా స్నేహితులంతా ఒకచోట చేరి సరదాగా గడపడం విశేషం. మొత్తానికి ఈ దీపావళి వేడుకలు స్టార్ హీరోల భార్యల కలయికతో సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారితీశాయి.

ALSO READ:
‘రామాయణం’పై వర్మ ప్రశంసల వర్షం.. విమర్శకులకు తనదైన స్టైల్‌లో కౌంటర్!

Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదం.. దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్‌!

Chandini Chowdary: చాందిని చౌదరి.. బాబీ సింహ.. ఓ డార్క్ కామెడీ

Updated Date - Nov 09 , 2026 | 03:26 PM