మొన్న కృతి.. నేడు రకుల్.. పండగపూట ఆ బట్టలేంటి .. సిగ్గులేదా
ABN , Publish Date - Nov 09 , 2026 | 03:57 PM
పండగ అంటేనే.. అది సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యగా హిందూ పండగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా, దీపావళీ, రాఖీ పౌర్ణిమ, సంక్రాంతి ఈ పండగలను అందరూ చాలా నిష్టతో చేస్తారు.
పండగ అంటేనే.. అది సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యగా హిందూ పండగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా, దీపావళీ, రాఖీ పౌర్ణిమ, సంక్రాంతి ఈ పండగలను అందరూ చాలా నిష్టతో చేస్తారు. ఆ పండగలకు సంబంధించి ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వారిని నిర్మొహమాటంగా ఎండగడతారు. ఈమధ్యకాలంలో హిందూ పండగల సమయంలో బాలీవుడ్ నటీమణులు అనుసరిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పండుగ ఏదైనా సరే హిందూ సంప్రదాయ వేడుకల వచ్చేసరికి హీరోయిన్లు కావాలనే గ్లామర్ హద్దులు దాటుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ భామలు కృతి సనన్, దిశా పటానీ కూడా సరిగ్గా ఇదే తరహా వివాదాలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. బ్రాండ్ ప్రమోషన్ కోసం దిశా దీపావళీ పండగ రోజు బికినీతో దీపం పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటో ఎంతటి రచ్చ రేపిండో అందరికీ తెల్సిందే. ఇక మొన్నటికి మొన్న కృతి.. రక్షా భందన్ యాడ్ లో క్లీవేజ్ షో చేసి వివాదాన్ని కొనితెచ్చుకుంది. ఇక ఈ లిస్ట్ లో చేరింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన రాణి-పింక్ ప్యానెల్ లెహంగాలో ఆమె ట్రెడిషనల్ లుక్‌లో కనిపించినప్పటికీ.. క్లీవేజ్ షో చేయడంతో పెద్ద ఎత్తున వివాదం మొదలయ్యింది.
పండగ పూట వేసుకొనే బట్టలా ఇవి.. సిగ్గు లేదా..ముస్లిం పండుగ అయిన ఈద్ లేదా ఇతర ఇస్లామిక్ వేడుకల సమయంలో పూర్తిగా నిండుగా, సాంప్రదాయ పద్ధతిలో, ఎంతో గౌరవప్రదమైన దుస్తులలో కనిపించే ఈ నటీమణులు.. హిందూ పండుగలైన దీపావళి, రక్షాబంధన్, హోలీ లేదా నవరాత్రుల వచ్చేసరికి మాత్రం అత్యంత మోడ్రన్, గ్లామర్, ఎక్స్పోజింగ్ డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. ఇలా పండుగలను బట్టి దుస్తుల ఎంపికలో వివక్ష చూపడం హిందూ పండుగలను, హిందువులను అవమానించడమే అవుతుంది అంటూ నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
కేవలం ఫ్యాషన్ లేదా ట్రెండ్ పేరుతో హిందూ సాంప్రదాయ పండుగలను సెలబ్రిటీలు కేవలం గ్లామర్ ప్రదర్శన కోసమే వాడుకుంటున్నారని, ఇతర మతాల పండుగలకు ఇచ్చే గౌరవం హిందూ పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నిలదీస్తున్న పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం రామాయణలో శూర్పణఖ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి పౌరాణిక మరియు సాంప్రదాయ విలువలతో కూడిన సినిమాలలో నటించిన నటీమణులే నిజ జీవితంలో ఇలా వ్యవహరించడం పట్ల అభిమానులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, బాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ప్రతి పండుగ సీజన్లోనూ పుట్టుకొస్తున్న ఈ వివాదాలు రాబోయే రోజుల్లో మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి.