Happy Journey OTT: ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ABN , Publish Date - Nov 09 , 2026 | 08:04 PM
ఆమని, ఝాన్సీ, అన్నపూర్ణ కీలక పాత్రల్లో నటించిన తెలుగు చిత్రం ‘హ్యాపీ జర్నీ’ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.
థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో తెలుగు సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఆమని (Aamani), ఝాన్సీ (Jhansi), అన్నపూర్ణ (Annapurna) కీలక పాత్రల్లో నటించిన ‘హ్యాపీ జర్నీ’ (Happy Journey) ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. ఏడు తరాలకు చెందిన ఏడుగురు మహిళల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తమ రోజువారీ జీవితాలు, బాధ్యతలను పక్కనపెట్టి.. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఫ్రీగా యూరప్ పర్యటనకు బయలుదేరుతారు. ఈ ట్రిప్ ఉచితం కావడంతో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సరదా సంఘటనలు, సవాళ్లు, కొత్త అనుభవాలు వారి మధ్య అనుబంధాలను మరింత బలపరుస్తాయి. మహిళల స్నేహం, ఆత్మవిశ్వాసం, తమను తాము కొత్తగా తెలుసుకునే ప్రయాణంగా ఈ సినిమా సాగుతుంది.

సెప్టెంబర్ 18న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ (Sun NXT) ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13 నుంచి ‘హ్యాపీ జర్నీ’ అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించే అవకాశం దక్కనుంది.
అభిరామ్ నాయుడు (Abhiramm Naidu) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, గుండాల కౌశిక్ రెడ్డి నిర్మించారు. ఆమని, ఝాన్సీ, అన్నపూర్ణ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.