సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రజనీకాంత్‌తో ధనుష్ కొడుకు.. ఆ స్టైల్ ఎక్కడికి పోతుంది?

ABN, Publish Date - Nov 20 , 2026 | 11:08 AM

‘జైలర్ 2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు.

Rajinikanth with Grandson Yatra Raja

‘జైలర్ 2’ (Jailer 2) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్‌ల వివాహ వేడుక కోసం ఫ్యామిలీతో కలిసి గ్రీస్ దేశానికి వెళ్లిన తలైవా.. పెళ్లి వేడుకల అనంతరం ఏథెన్స్ నగరంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన ఫోటోలను రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.


ఈ వైరల్ ఫోటోలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన పెద్ద మనవడు (Grandson), హీరో ధనుష్ - ఐశ్వర్యల పెద్ద కుమారుడు యాత్రా రాజా (Yatra Raja)తో కలిసి స్టైలిష్‌గా నడుస్తూ కనిపించారు. బ్రౌన్ కలర్ ఫుల్-స్లీవ్ టీ-షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, బ్లాక్ క్యాప్, కళ్లద్దాలు ధరించి రజనీకాంత్ తనదైన సిగ్నేచర్ స్వాగ్‌తో అడుగులేస్తుండగా.. ఆయన పక్కనే యాత్రా రాజా ఆల్-వైట్ లినెన్ షర్ట్, ప్యాంట్, కళ్లద్దాలు ధరించి, చేతిలో టోపీ పట్టుకుని హీరో రేంజ్ లుక్‌లో అదరగొట్టారు. తాతకు తగ్గ మనవడిగా యాత్రా రాజా నడక, స్టైల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఆ స్టైల్, స్వాగ్ ఎక్కడికి పోతుంది.. అచ్చం తాత రజనీకాంత్, తండ్రి ధనుష్ పోలికలతో హీరోలా ఉన్నాడు’, ‘తాత దగ్గర ఓనమాలు నేర్చుకుంటున్న మనవడు’ అంటూ అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.


ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘జైలర్ 2’ సక్సెస్ తర్వాత రజనీకాంత్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ధర్మన్’ (Dharman) అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనితో పాటు, దశాబ్దాల విరామం తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రానికి ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా ఒకవైపు క్రేజీ సినిమాలతో అలరిస్తూనే, మరోవైపు మనవళ్లతో కలిసి తలైవా ఇలా హ్యాపీగా గడుపుతుండటం అభిమానులకు కనువిందు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

అండర్‌వరల్డ్ డాన్‌ సల్మాన్.. అండర్‌కవర్ కాప్‌ నయన్.. ‘మాన్‌స్టర్’ కథ ఇదేనా?

RAPO23: ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్.. అర్థమేంటో తెలుసా?

‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది

Updated Date - Nov 20 , 2026 | 11:08 AM