మనవళ్లతో సూపర్ స్టార్.. ఇలా ఎప్పుడూ చూడలేదు కదా
ABN, Publish Date - Nov 18 , 2026 | 08:16 PM
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆయన ఏం చేసినా.. స్టైలే. ఎలా కనిపించినా కలెక్షన్ల సునామీనే. అది సూపర్ స్టార్ రేంజ్.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth).. ఈ పేరుకే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆయన ఏం చేసినా.. స్టైలే. ఎలా కనిపించినా కలెక్షన్ల సునామీనే. అది సూపర్ స్టార్ రేంజ్. రీసెంట్గా వచ్చిన ‘జైలర్ 2’తో మరోసారి తన సత్తా ఏంటో చాటిన రజనీ.. తాజాగా ఎప్పుడూ లేని విధంగా కనిపించి అందరినీ అలరించారు. రజనీకాంత్‌కు సంబంధించి సినిమాల విషయమే కానీ, ఫ్యామిలీకి సంబంధించి ఆయన పెద్దగా ఎప్పుడూ ఎక్స్పోజ్ అవరు. ఫస్ట్ టైమ్ కుమార్తెలు, మనవళ్లతో కనిపించి, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అవును, ఈ ఫొటో చూసిన వారంతా.. సూపర్ స్టార్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు కదా.. ఆయన ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారంటే.. ఈ ఫొటోకున్న స్పెషలేంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ ఫొటో విషయానికి వస్తే.. ఇటీవల అనిరుధ్, కావ్య మారన్ పెళ్లికి ఫ్యామిలీ (Rajinikanth Family)తో కలిసి గ్రీస్ దేశానికి వెళ్లిన సూపర్ స్టార్.. ఆ పెళ్లి అనంతరం తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఏథెన్స్ నగరంలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను రజనీకాంత్ కుమార్తె సౌందర్య.. ఇన్‌స్టా వేదికగా షేర్ చేయడంతో, అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలో రజనీ భార్య లత రజనీకాంత్, కుమార్తెలు, మనవళ్లు అందరూ ఉన్నారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, నవ్వుతూ అందరూ హాయిగా అడుగులు వేస్తున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలు చూసిన వారంతా.. ‘మా తలైవా ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి’, ‘తలైవా బ్యూటీఫుల్ ఫ్యామిలీ’.. అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫొటో షేర్ చేస్తూ.. ‘ఏథెన్స్లో మేమంతా ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకున్నాం. ఈ లవ్లీ ఫ్యామిలీ ట్రిప్‌లోని ప్రతి క్షణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నాం’ అని రాసుకొచ్చారు రజనీ కుమార్తె సౌందర్య. ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ హీరోగా ‘ధర్మన్’ అనే సినిమా ఒకటి సెట్స్‌పై ఉంది. ఈ సినిమా తర్వాత ‘జైలర్’ సిరీస్ చిత్రాల దర్శకుడు నెల్సన్‌తో సూపర్ స్టార్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా మరో హీరోగా నటించనున్నారు. మల్టీస్టారర్ చిత్రంగా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే
‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?