Rajinikanth Nag Ashwin: రజనీతో.. నాగ్ అశ్విన్ సినిమా! సోషల్ మీడియా షేక్
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:29 AM
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు తెర లేచింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుండగా సినీ లవర్స్ లో అంతకుమించి క్యూరియాసిటీని నింపుతోంది.
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు తెర లేచింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుండగా సినీ లవర్స్ లో అంతకుమించి క్యూరియాసిటీని నింపుతోంది. వావరాల్లోకి వెళితే.. గత సంవత్సరం కల్కి (Kalki 2898 AD ) సినిమాతో వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మహానటి (Mahanati) ఫేం నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబోలో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తమిళ, తెలుగు మీడియాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సరిపోదా శనివారం ఫేం దర్శకుడు వివేక్ ఆత్రేయ సైతం రజనీ కాంత్‌తో ఓ సినిమా చర్చ జరుగుతుందని చాలా రోజులుగా చర్చ నడుస్తున్న సమయంలో సడన్‌గా ఇప్పుడు ఈ వార్త మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ సినిమాను తన హోం బ్యానర్, తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక బ్యానర్ అశ్వినీదత్ ఆథ్వర్యంలోని వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ రజనీ కాంత్‌ను కలిసి స్టోరీ డిస్కస్ చేసినట్లు రజనీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, డెవలప్ చేయమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే #Rajinikanth, #NagAshwin, #VyjayanthiMovies హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
అయితే.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 తీసేందుకు ఉపక్రమిస్తున్న సమయంలో ఇప్పుడీ వార్త సౌత్ ఇండియాను ఊపేస్తుంది. ఒకవేళ ఈ కాంబో పట్టాలెక్కితే కల్కి 2 వాయిదా పడుతుంది అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉంటే.. వైజయంతి మూవీస్ అశ్వినీ దత్‌కు రజనీకాంత్‌తో మంచి స్నేహా సంబంధాలు ఉన్నాయి. రజనీకాంత్ చివరిగా తెలుగులో నటించిన సినిమా కథానాయకుడు ఈ బ్యానర్ నుంచే రావడం గమనార్హం. అంతేగాక చాలాకాలం తర్వాత కమల్ హసన్ (Kamal Haasan) ఈ బ్యానర్ తోనే తెలుగులో కల్కి సినిమాలో నటించగా ఇప్పుడు రజనీ కాంత్ సైతం ఈ బ్యానర్ ద్వారానే తెలుగులో సినిమా చేయనుండడం విశేషం. అనుకున్న ప్రకారం ఈ సినిమా ఓకే అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలో మరో ఎపిక్‌గా మారే అవకాశం ఉంది.