Jailer 2: టైగర్.. ముత్తువేల్ పాండియన్ మళ్లీ వచ్చాడు
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:25 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కి సీక్వెల్ అనగానే అటు కోలీవుడ్ మాత్రమే కాదు ఇటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురుచూసింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కి సీక్వెల్ అనగానే అటు కోలీవుడ్ మాత్రమే కాదు ఇటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురుచూసింది. ఇక ఎట్టకేలకు జైలర్ 2 (Jailer 2) రిలీజ్ కి సిద్దమయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా జైలర్ 2 ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
జైలర్ సినిమా చివరి నుంచే జైలర్ 2 మొదలవుతుందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. వర్మని చంపిన తరువాత.. ముత్తువేల్ పాండియన్.. అతనిపైన ఇంకెవరైనా బాస్ ఉన్నాడా అని వెతుకులాటలో పడతాడు. వర్మను చంపింది ఎవరు అని ఇంకొంతమంది గ్యాంగ్స్ ముత్తువేల్ వెనుక పడతాయి. ఇక జైలర్.. శత్రువులందరినీ ఒకేచోట చేర్చి చంపాలని ప్లాన్ చేస్తాడు. మరి చివరకు ఏం జరిగింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
జైలర్ లో స్టార్ క్యామియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ ఇలా ప్రతి ఒక్కరికి ఒక హైప్ ఉంది. జైలర్ 2 లో కూడా వారి క్యామియో మళ్లీ ఉండబోతుందని ట్రైలర్ లో వారి లుక్స్ చూపించి కన్ఫర్మ్ చేశారు. ఇక వారిని మించి ఈ సీక్వెల్ లో స్టార్స్ ని దించాడు నెల్సన్. విద్యా బాలన్, సూరజ్, ఎస్ జె సూర్య, మిథున్ చక్రబోర్తి.. వీరందరూ మాఫియా కింగ్స్ గా కనిపించారు. ఇక సినిమాకి హైలైట్ అంటే అనిరుధ్ మ్యూజిక్ అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ సీక్వెల్ కి కూడా అనిరుధ్ మ్యూజికే నిలబెడుతుందని తెలుస్తోంది. మొత్తానికి టైగర్ ముత్తువేల్ పాండియన్ ట్రైలర్ తోనే హైప్ తెప్పించాడు. మరి జైలర్ 2 ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే.
Also Read:
నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది
'సప్త సాగరాలు సప్త గిరులు'గా తెలుగులో...
నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్