సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:40 PM

తమిళనాడు సీఎం విజయ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. తను నటించిన ‘ఓం’ చిత్రం విడుదల సందర్భంగా ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.

Dhanush and CM Vijay

తమిళనాడు సీఎం విజయ్‌ (CM Vijay)కు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్ నిర్మాణంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘ఓం ఛాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ (OM Chapter 1: Udhiram – The Blood Wood). నవంబర్ 20న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల ఆటకు అనుమతినిచ్చిన సీఎం విజయ్‌కు, ఆయన ప్రభుత్వానికి ధనుష్ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అభిమానులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇతరులకు అసౌకర్యం కలిగించవద్దని కోరుతూ.. ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..


‘‘ఒక సినిమా విజయం అనేది వివిధ విభాగాలకు చెందిన ఎంతో మంది సమష్టి కృషి, అంకితభావంతో సాధ్యమవుతుంది. అలాంటి సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ మీరు అందించే అతిపెద్ద మద్దతు ఏమిటంటే.. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూడటం, తద్వారా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడటమే.

రాబోయే నవంబర్ 20వ తేదీన విడుదల కానున్న ‘ఓం’ చిత్రానికి ఉదయం 6 గంటల ప్రత్యేక ఆటకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి, గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయం 6 గంటల ఆటకు హాజరయ్యే అభిమానులందరూ అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా, అలాగే ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. సినిమాను చూసి ఆనందించడమే నిజమైన పండుగ. అందరికీ ధన్యవాదాలు..’’ అని పేర్కొన్నారు.


ధనుష్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఈ లేఖ వైరల్ అవుతోంది. అటు విజయ్, ఇటు ధనుష్ అభిమానులు తమ హీరోలను పొగుడుతూ చేస్తున్న కామెంట్స్ సైతం వైరల్ అవుతుండటం విశేషం. ధనుష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని టీమ్ అంతా నమ్మకంగా ఉంది. ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే..

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?

‘రామాయణ’కు తక్కువ ఫుట్‌ఫాల్స్.. భారీ కలెక్షన్స్.. ఎలా సాధ్యమైంది?

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ బంధంపై గీతా భాస్కర్ క్లారిటీ.. అదీ విషయం

Updated Date - Nov 18 , 2026 | 07:20 PM

Dhanush 55: ధనుష్ 55 ‘ఓం’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Dhanush Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి.. ఎట్ట‌కేల‌కు మృణాల్ రెస్పాండ్‌

Dhanush New Movie: అక్టోబర్‌లో అల్లుడు

CM Vijay: అర గంట కూడా ఆగలేకపోతున్నారు.. సీఎం కోటు, సూటు వేసుకోవడం తప్పా?

CM Vijay: నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన ఘటన అదే..