ఆ విషయంలో హీరోయిన్లకు మినహాయింపు లేదు: ‘బ్లాస్ట్’ బ్యూటీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 08:41 AM
చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ ఇమేజ్ ఉన్నా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని ప్రాథమిక పద్ధతుల విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు ‘బ్లాస్ట్’ బ్యూటీ ప్రీతి ముకుందన్.
చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ ఇమేజ్ ఉన్నా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని ప్రాథమిక పద్ధతుల విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు ‘బ్లాస్ట్’ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). కోలీవుడ్ అగ్ర కథానాయకుడు ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక 56వ (Dhanush56) చిత్రంలో కథానాయికగా ఆమె ఎంపికయ్యారు. ఈ క్రమంలో చిత్ర ఎంపిక, ఆడిషన్స్ ప్రక్రియపై ఆమె పంచుకున్న అభిప్రాయాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ధనుష్ 56వ చిత్రంలో అవకాశం రావడంపై ప్రీతి ముకుందన్ స్పందిస్తూ.. ‘‘ధనుష్ 56 ప్రాజెక్ట్ కోసం నిర్వహించిన ఆడిషన్స్‌లో నేను స్వయంగా పాల్గొన్నాను. ఒక సినిమాలో నటించేందుకు ఆడిషన్స్‌కు హాజరవడం అనేది పరిశ్రమలో అత్యంత సహజమైన విషయం. మనం ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించి కథానాయికగా పేరు తెచ్చుకున్నంత మాత్రాన.. కొత్త పాత్రలకు ఆడిషన్స్ ఇవ్వకూడదని గానీ, హీరోయిన్లకు అందులో ప్రత్యేక మినహాయింపులు ఉంటాయని గానీ అనుకోకూడదు. పాత్రకు మనం సరిపోతామా లేదా అనేది ఆడిషన్ ద్వారానే తెలుస్తుంది’’ అని ఆమె కుండబద్దలు కొట్టారు.
కథల ఎంపికలో తొలుత తప్పిదాలు చేసిన ఈ భామ ఇప్పుడంతా పక్కా ప్లానింగ్‌తో వెళుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో తన దృక్పథాన్ని వివరిస్తూ.. ‘‘ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు దర్శకుడు కథను నేరేట్ చేసే విధానం, అందులో నా పాత్రకు లభించే ప్రాధాన్యతను మాత్రమే ప్రధానంగా చూస్తాను. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభ రోజుల్లో కథల ఎంపికలో కొన్ని పొరపాట్లు చేశాను. అయితే ఆ అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకుని, ఇప్పుడు పూర్తి జాగ్రత్తతో కూడిన మంచి కథలను మాత్రమే ఎంచుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ, నా నటన, ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకోవడమే నా ఏకైక లక్ష్యం’’ అని ప్రీతి ముకుందన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
జనవరి 12న విడుదల.. అనిల్ రావిపూడి, నీ చర్యలు ఊహాతీతం
Danny: రా అండ్ రస్టిక్ చిత్రం ‘డానీ’ రిలీజ్ డేట్ ఖరారు
త్వరలోనే థియేటర్లలోకి రాబోతోన్న ‘భగవంతుడు’