MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
ABN, Publish Date - Oct 15 , 2026 | 10:06 AM
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు.
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను (MS Subbulakshmi Biopic) ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ (Bharat Ratna M.S. Subbulakshmi) సినిమాగా.. విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) చేతుల మీదుగా గత నెలలో ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ఆశీస్సులు లభించాయి.
‘‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’’ సినిమా తెరకెక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమా మరో ‘శంకరాభరణం’ అవుతుందని రజనీకాంత్ రీసెంట్గా జరిగిన ‘జైలర్ 2’ సినిమా ఈవెంట్లో చెప్పారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను స్క్రీన్ మీద చూసేందుకు తాను వేచి చూస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు. రజనీ చేసిన ఈ వ్యాఖ్యలతో ‘‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’’ టైటిల్ సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అవుతోంది. మొన్న కమల్, ఇప్పుడు రజనీ.. ఇలాంటి సినిమాలకు ఈ లెజెండ్స్ సపోర్ట్ అందించడం చాలా గొప్ప విషయం అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ అనుకుంటూ ఉండటం విశేషం.
ఇక ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ సినిమా లాంచ్ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత దేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ. ఆమె సంస్కృతం, హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో ఆమె పాట పాడినా భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. ఆమె సంగీతమే మనకు అందించిన సందేశం. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. అమ్మ ఆలపించిన సుప్రభాతం, లలితసహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మహాత్మాగాంధీ కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమాని. ఆమె పాటలు విని సంతోషించేవారు. అమ్మ బయోపిక్ నిర్మిస్తున్న అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అనిరుధ్ సంగీత ప్రస్థానం కూడా ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లబోతోంది. దర్శకుడు గౌతమ్ పై చాలా బాధ్యత ఉంది. ఎంఎస్ అమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న రశ్మికను చూస్తే నేను అసూయపడటం లేదు. గడ్డం తీసేసినా నేను ఆమె పాత్రలో నటించి మెప్పించలేను. ఈ దేశ మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఐకానిక్ వుమెన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ. ఈ టీమ్ అందరికీ నా బెస్ట్ విసెస్ తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Soori7: మైత్రీ మూవీ మేకర్స్లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్గా ప్రారంభం
ధనుష్ అభిమాన సంఘం పేరు మార్పు.. రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చ
Rashmika: 400 పేద కుటుంబాలకు అండగా.. రష్మిక సంచలన నిర్ణయం