ధనుష్ అభిమాన సంఘం పేరు మార్పు.. రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చ

ABN , Publish Date - Oct 15 , 2026 | 08:57 AM

కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు ధనుష్ తన అభిమాన సంఘం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అభిమాన సంఘాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ఆయన తీసుకున్న నిర్ణయం పలు చర్చలకు తావిస్తోంది.

Dhanush Fans Association Name

కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు ధనుష్ (Dhanush) తన అభిమాన సంఘం విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్ పేరును మారుస్తూ అధికారికంగా నిర్ణయం వెలువరించారు. ఇకపై తన అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ సంఘం)గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. బుధవారం కోయంబత్తూరులో నిర్వహించిన అభిమాన సంఘం నిర్వాహకుల కీలక సమావేశంలో ఈ మేరకు అధికారికంగా తీర్మానం చేశారు.


ప్రస్తుతం ఈ సంఘం ‘అఖిల భారత ధనుష్ అభిమానుల సంక్షేమ సంఘం’ పేరిట కొనసాగుతోంది. ఇప్పటికే ఈ అసోసియేషన్‌కు సంబంధించి ఓ ప్రత్యేక జెండాను కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సంఘం ఆధ్వర్యంలో ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పలు రకాలైన సేవా, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత వ్యవస్థీకృతంగా సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతోనే ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (Dhanush Narpani Iyakkam)గా పేరు మార్చినట్లు సమాచారం.


ఈ పరిణామంతో తమిళనాట ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. భవిష్యత్‌లో ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని, అందుకోసమే తన అభిమాన సంఘాన్ని సేవా సంస్థ తరహాలో పునర్వ్యవస్థీకరిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా, ఆయన తన రాజకీయ పార్టీ పేరును ‘తమిళగ ఎళుచ్చి కళగం’గా ఖరారు చేసుకున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నడుమ అభిమాన సంఘం పేరు మార్పు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు వరుస చిత్రాలతోనూ ధనుష్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతుల్లో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ‘ఓమ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

Rashmika: 400 పేద కుటుంబాలకు అండగా.. రష్మిక సంచలన నిర్ణయం

Kalki 2: నాగ్ అశ్విన్ ప్లాన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

బాబు కోరుకున్నట్లే బైక్ కొనిస్తా: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Updated Date - Oct 15 , 2026 | 08:57 AM

Dhanush - Aishwarya: ఫైనల్‌గా విడిపోవడానికే ఓటు..

Dhanush - Mrunal: ధనుష్‌.. మృణాల్‌ ఛాట్‌ రచ్చరచ్చ

Dhanush 55: ధనుష్ 55 ‘ఓం’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Dhanush Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి.. ఎట్ట‌కేల‌కు మృణాల్ రెస్పాండ్‌

Dhanush New Movie: అక్టోబర్‌లో అల్లుడు