Bharateeyudu 3: కమల్, శంకర్ నుంచి మరో భారీ అప్‌డేట్.. 10 రోజుల్లో షూటింగ్
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:54 PM
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారతీయుడు 3 మిగిలిన షూటింగ్‌ను 10 రోజుల్లో పూర్తి చేయనున్నారు. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రెస్టీజియష్ చిత్రాలను నిర్మిస్తోన్న భారీ నిర్మాణ సంస్థ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘భారతీయుడు -3’. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీకి స్వీకెల్‌గా భారతీయుడు-2, భారతీయుడు - 3 చిత్రాలను కమల్, శంకర్ కాంబోలో రూపొందించటానికి లైకా సంస్థ సిద్ధమైంది. అందులో భాగంగా 2024లో భారతీయుడు 2 విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు-3’ను చిత్రీకరించటానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఇప్పటికే ‘భారతీయుడు3’లో కొంత భాగాన్ని చిత్రీకరించారు. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 10 రోజుల్లో ‘భారతీయుడు3’కి సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేయటానికి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలో రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళుతుంటే దుమ్ము, దూళి రేగుతున్నట్టుగా ఉండే ఫొటో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. 'భారతీయుడు 3' ఎలా ఉండబోతుందనే విషయాన్ని 'భారతీయుడు 2' క్లైమాక్స్‌లో చూపించారు. మరి ఈసారి సేనాపతి లంచాన్ని అంతమొందించటానికి చేసే పోరాటం ఎలా ఉంటుందో వేచిచూడాలి. 'భారతీయుడు 3'లో ఎస్.జె. సూర్య, ప్రియ భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముతిరఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, ప్రియూష్ మిశ్రా, గురు సోమసుందరం, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు తెలుగులో పాటలను శ్రీమణి, సంభాషణలను హనుమాన్ చౌదరి అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘మా భూమి’ దర్శకుడు.. బి. నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్! గవర్నర్ చేతుల మీదుగా సత్కారం
తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి
యాంకర్ ఫొటోలు మార్ఫింగ్.. అసభ్యకర పోస్టులు