సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లెజెండరీ మల్టీస్టారర్‌‌ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!

ABN, Publish Date - Apr 25 , 2026 | 04:46 PM

ఒక పెద్ద సినిమా థియేటర్లో నిలబడితే.. చిన్న సినిమాలకు కూడా ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ, అలాంటి అవకాశం ఈ వేసవికి లేకుండా పోయింది. కనీసం డబ్బింగ్ సినిమాలైనా థియేటర్లను ఫిల్ చేస్తాయేమో అనుకుంటే, అవి కూడా చేతులెత్తేశాయి.

Patriot Movie Update

పాన్ ఇండియా వైడ్‌గా సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జనాలు థియేటర్లకు రావడం తగ్గించేయడంతో, థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే.. సినిమాలకు సంక్రాంతి తర్వాత అతి పెద్ద సీజన్ అంటే సమ్మరే. కానీ, ఈ సమ్మర్‌లో టాలీవుడ్ ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. వారం వారం సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి.. తప్పితే.. బాక్సాఫీస్‌ని షేక్ చేసే స్ట్రాంగ్ సినిమా ఒక్కటీ పడటం లేదు. స్టార్ హీరోల సినిమాలన్నీ సైడ్ అవడంతో, చిన్న సినిమాలైనా సత్తా చాటుతాయని అనుకుంటే, అవి కూడా ప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్నాయి. దీనికి ఐపీఎల్ (IPL), ఓటీటీ (OTT) కారణాలు అని చెప్పడానికి లేదు.. జనాలను ఆకర్షించే కంటెంట్ లేకపోవడమే పెద్ద కారణం అని చెప్పుకోవాలి.


ఒక పెద్ద సినిమా థియేటర్లో నిలబడితే.. చిన్న సినిమాలకు కూడా ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ, అలాంటి అవకాశం ఈ వేసవికి లేకుండా పోయింది. కనీసం డబ్బింగ్ సినిమాలైనా థియేటర్లను ఫిల్ చేస్తాయేమో అనుకుంటే, అవి కూడా చేతులెత్తేశాయి. దీంతో చెప్పుకోదగ్గ సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ భారీగా డౌన్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడందరి ఆశలు లెజెండరీ స్టార్స్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘పేట్రియాట్’ (Patriot) పైనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 23నే విడుదల కావాల్సి ఉంది. చివరి నిమిషంలో మేకర్స్ వన్ వీక్ వాయిదా వేశారు. మే 1న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై టాలీవుడ్‌లో అసలు బజ్ అనేది లేదు. చాలా మందికి ఈ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి.


మరో వైపు మే 1న విడుదలకు సిద్ధమైన ‘జెట్లీ’, ‘గాయపడ్డ సింహం’ వంటి చిత్రాలు ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్నాయి. మమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohanlal), ఫాహద్ ఫాజిల్, నయనతార వంటి స్టార్స్ నటించినా.. ‘పేట్రియాట్’ చిత్రంపై అసలు క్రేజే లేదు. పాన్ ఇండియా సినిమాగా చెప్పుకుంటున్నా, మలయాళ మార్కెట్ మినహా.. ఈ సినిమాకు ఎక్కడా ఎటువంటి హడావిడి చేయడం లేదు. టైమ్ కూడా చాలా తక్కువ ఉంది.. ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. డబ్బింగ్ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను అసలు పట్టించుకోవడం లేదు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇందులో నటించిన వారందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. నయనతార సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఫాహద్ ఫాజిల్ గురించి చెప్పేదేముంది. ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. అయినా కూడా సినిమాపై ఎటువంటి హైప్ క్రియేట్ అవడం లేదు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత లెజెండరీ యాక్టర్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తోన్న చిత్రమిది. అలాంటిది.. ఎటువంటి క్రేజ్ ఏర్పడలేదంటే.. తప్పిదం ఎవరిదో అర్థం చేసుకోవచ్చు. చూద్దాం.. ఫైనల్‌గా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో?

ఇవి కూడా చదవండి:

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 04:46 PM