‘జననాయగన్’ మూవీ లీక్‌లో మరో ట్విస్ట్.. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్ట్ వైరల్!

ABN , Publish Date - Apr 13 , 2026 | 09:45 PM

ఏ సినిమా లీక్ అయినా అది ఎడిటర్స్ మీదకో.. లేదంటే, స్టూడియోల మీదకో నెట్టేస్తుంటారు. అలాగే ‘జననాయగన్’ విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని అంతా భావిస్తున్న క్రమంలో.. ఈ సినిమా పైరసీ విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ.

Vijay in Jana Nayagan

ఏ సినిమా లీక్ అయినా అది ఎడిటర్స్ మీదకో.. లేదంటే, స్టూడియోల మీదకో నెట్టేస్తుంటారు. అలాగే ‘జననాయగన్’ విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని అంతా భావిస్తున్న క్రమంలో.. ఈ సినిమా పైరసీ విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ (Gopikrishna). ప్రస్తుతం విచారణ జరుగుతోంది కాబట్టి అప్పుడే ఎవరినీ నిందించొద్దంటూ, ఆయన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఓ లేఖలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలో..


‘‘జననాయగన్ (Jana Nayagan) సినిమా లీక్‌కు సంబంధించి మా ప్రెస్ మీట్‌లో మేము ఏ నిర్దిష్టమైన పోస్ట్-ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పేర్లను ప్రస్తావించలేదని సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. ఈ ప్రక్రియలో అనేక మంది వ్యక్తులు, వివిధ సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దీనికి కారణమైన దోషులను పట్టుకునేందుకు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాబట్టి, దయచేసి ఎలాంటి నిరాధారమైన రూమర్స్‌ను నమ్మవద్దు!’’ అని ‘జననాయగన్’ ఇష్యూపై సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ పేర్కొన్నారు.


ఆయన ఈ క్లారిటీ ఇవ్వడానికి కారణం ఉంది. అదేంటంటే, ‘జననాయగన్’ మూవీ సన్నివేశాలు లీకవ్వడానికి కారణం ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్ అనేలా ప్రచారం జరుగుతున్న క్రమంలో.. ఎడిటర్స్ యూనియన్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం, ‘గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్ నిమిత్తం దర్శకనిర్మాతల అనుమతితోనే ఓ స్టూడియోకి కాపీని ఎడిటర్ పంపారని, నిజంగా ఆయన లీక్ చేయాలనుకుంటే, వాటర్ మార్క్ కూడా అవసరం లేకుండా చేయగలడు’ అని స్పష్టతనిచ్చారు. ఇందులో ఏ స్టూడియో పేరు వారు ప్రస్తావించలేదు. ఇదే విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్.. ఇలా లేఖ ద్వారా తెలిపారు. మొత్తానికి ఈ లీక్ విషయంలో రోజుకో ట్విస్ట్ అన్నట్లుగా విషయాలు బయటికి వస్తున్నాయి. మరి అసలు నిందితులు ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఇది ప్రతి ఊరి కథ - ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ దర్శకుడు

‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 13 , 2026 | 09:45 PM

Jana Nayagan Movie: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌

Jana Nayagan: ఓపిక లేదా? జన నాయగన్‌పై.. హైకోర్టు ఆగ్రహం! సింగిల్ జడ్జి తీర్పుపై స్టే

Jana Nayagan: తన రికార్డును తానే బ్రేక్ చేసిన విజయ్

Jana Nayagan: ఆ ఒక్కడి అభ్యంతరం.. జన నాయగన్ వాయిదా! కోట్ల న‌ష్టం

Jana Nayagan: విజయ్‌ చివరి సినిమా అనడం బాధగా ఉంది.. సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశా..