ఇది ప్రతి ఊరి కథ - ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ దర్శకుడు

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:31 PM

హీరోగా కిరణ్ అబ్బవరం అందరికీ పరిచయమే. ఇప్పుడీ హీరో న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ.. సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

Thimmarajupalli tv movie Director V Muniraju

హీరోగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అందరికీ పరిచయమే. ఇప్పుడీ హీరో న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ.. సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV) అనే సినిమాను నిర్మిస్తున్నారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా విశేషాలను దర్శకుడు వి. మునిరాజు (Director V. Muniraju) సోమవారం మీడియాతో పంచుకున్నారు.


‘‘దర్శకుడు కావాలనేది నా డ్రీమ్. ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ కోసం ఆన్‌లైన్ ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. కొంతకాలంగా ఆ పని చేస్తుంటే.. డైరెక్షన్ అనే నా డ్రీమ్‌కు దూరంగా ఉండిపోతున్నానేమో అని అనిపించింది. దాంతో ఒక స్క్రిప్ట్ అనుకుని, దాన్ని ఊరికి వెళ్లి అక్కడి వాళ్లతో డెమో షూట్ చేశాను. మళ్లీ తిరిగొచ్చి ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ చేయించాను. అప్పుడు ‘మీటర్’ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆ టైమ్‌లో కిరణ్ అబ్బవరం పరిచయం అయ్యారు. ఆయన ఏం చేస్తున్నావు? అని అడిగారు. అలా మాటల్లో నా డెమో మూవీ గురించి చెప్పాను. ఆయనకు నచ్చి కథ గురించి అడిగారు. స్క్రిప్ట్ చెప్పాక పూర్తిస్థాయిలో డెవలప్ చేయ్.. మనం మూవీ చేద్దామని అన్నారు. అలా ఈ మూవీకి తొలి అడుగులు పడ్డాయి


ఈ సినిమాకు స్ఫూర్తి అంటే.. నేను చిన్నప్పుడు చూసిన ఘటనలే. నేను చూసిన మనుషుల పాత్రలు, వారి భావోద్వేగాలు, నా చిన్నప్పటి అనుభవాలు.. ఇవన్నీ ఈ మూవీలో చిత్రీకరించాను. నేను తెరపై ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు అది నా ఊరి కథే ఎందుకు కాకూడదు? అని అనిపించింది. మా ఊరికి మొదటిసారి టీవీ వచ్చినప్పుడు.. దగ్గరలో ఉన్న థియేటర్ కదిలి వచ్చిందా? అనే భావన నాలో కలిగింది. ఇది ప్రతి ఊరి కథ. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీవీ నేపథ్యంగా నేను చూసిన ఘటనలు చూసే ఉంటారు. ఊరి మనుషులు, వారి మధ్య అహం వంటి అంశాలు చూపిస్తూనే.. చివరలో మంచి ఎమోషనల్ కంటెంట్ చెబుతున్నాం. ఈతరం జెన్ జీ కిడ్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఈతరం పిల్లలకు అప్పటి కల్చర్, సంప్రదాయాలు తెలియవు. అప్పుడు మనమంతా ఎలా ఉండేవాళ్లమో తెలియదు. కాబట్టి మా సినిమాలోని వాతావరణం అంతా వాళ్లకు కొత్తగా ఉంటుంది. ఈతరం పిల్లలు చూడని ప్రపంచం, చూడని విషయాలు ఈ సినిమాలో ఆకట్టుకుంటాయి. ప్యూర్ సస్పెన్స్ డ్రామా చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది? అని సీట్ ఎడ్జ్‌లో కూర్చుని చూస్తారు. చివరకు మంచి ఎమోషనల్ ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.


రాయలసీమ నేపథ్యంగా కథ సాగుతుంది. మా ఊరు తిమ్మరాజుపల్లి. అదే ఊరిలో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఇప్పటి వరకు చూసిన పాటలన్నీ మా ఊరు చుట్టుపక్కల రూపొందించినవే. రియలెస్టిక్ అప్రోచ్‌తో ఈ సినిమాను తెరకెక్కించాను. కమర్షియల్ సినిమాల మేకింగ్ స్టైల్ వేరు. నేను సాధ్యమైనంత సహజంగా, అలాంటి వాతావారణంలో సినిమాను తెరకెక్కించాను. కిరణ్ అబ్బవరం వంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకే కాదు.. మా టీమ్ అందరి అదృష్టం. ఇలాంటి చిన్న చిత్రానికి ఇంత మంచి రిలీజ్ ఇస్తున్నారు. కంటెంట్ బాగున్న ఎన్నో చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు, ఆదరిస్తున్నారు. కొత్త వాళ్లమైన మేము చేసిన ఈ సినిమా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్‌గా పేరు తెచ్చుకుంటుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుతం నేను ఐదారు కథలు సిద్ధం చేసుకున్నాను. మన చుట్టూ ఉన్న స్టోరీస్‌ను తెరకెక్కించాలనేది నా కోరిక..’’ అని దర్శకుడు వి. మునిరాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 13 , 2026 | 06:31 PM

Thimmarajupalli TV:  ఔత్సాహిక కళాకారులకు అండగా  కిరణ్ అబ్బవరం

Thimmarajupalli TV: నిర్మాత‌గా.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం తొలి సినిమా

Kiran Abbavaram: అప్పుడు మంచు విష్ణు.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: బిల్డప్స్‌ ఎక్కువయ్యాయి అంటున్నారు.. ఏం చేద్దాం..