సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

ABN, Publish Date - Apr 11 , 2026 | 05:54 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది. మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, నెల కూడా పూర్తికాకుండానే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Ustaad Bhagat Singh Poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది. మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, నెల కూడా పూర్తికాకుండానే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. కానీ, సినిమా అనుకున్నంతగా మాత్రం సక్సెస్ కాలేదు. అభిమానులందరూ హరీష్ శంకర్‌పై ఉన్న నమ్మకంతో.. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రాన్ని మించి, ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నిజం కాలేదు సరికదా, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఈ సినిమా తడబడింది. దీంతో, ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ వద్ద లాస్ ప్రాజెక్ట్‌గానే నిలిచింది.


థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులను మాత్రం బాగా అలరిస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ.. ఏప్రిల్ 16 (UBS Streaming Date) నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్సయిన వారంతా ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ విషయానికి వస్తే..


దాదాపు 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ వచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి వీరిద్దరి కాంబో సెట్ అయ్యింది. అందులో పొగరుబోతు పోలీస్‌గా నటించిన పవన్, ఇందులోనూ అలాంటి పాత్రే చేశాడు. అయితే ఇది ఓ తండా నుండి నగరానికి వచ్చిన పోలీస్ కథ. పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలని కోరుకుంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడైన చంద్రశేఖరరావు (కె.ఎస్. రవికుమార్). అన్యాయాన్ని సహించని గూడెం పిల్లాడు ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఆయనే చేరదీసి, సరైన మార్గంలో పెడతాడు. చదువు చెప్పిస్తాడు. అప్పటి సీ.ఎం. కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన చంద్రశేఖరరావు ఆ తర్వాత సీఎం అవుతాడు. ఆయన శిష్యుడైన భగత్ సింగ్ ఏ.సి.పి. అవుతాడు. అయితే సీఎం కుర్చీపై కన్నేసిన చదలమర్రి నల్ల నాగప్ప (పార్తీబన్) ఎలాగైనా ఆ పదవిని చేపట్టాలని చూస్తాడు. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నానికి ఒడిగడతాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఏకంగా చంపేస్తాడు. చివరకు తాను సీఎం అవుతాడు. అయితే ఈ క్రమంలో అతను దేశ వ్యతిరేక శక్తులతో, టెర్రరిస్టులతోనూ చేతులు కలుపుతాడు. పదవి పిచ్చి పట్టిన నల్ల నాగప్ప మదాన్ని ఉస్తాద్ ఎలా అణిచాడు? తన గురువు చంద్రశేఖర్‌ను తిరిగి సీఎం పీఠం మీద ఎలా కూర్చో పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి:

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

Updated Date - Apr 11 , 2026 | 05:57 PM