Ustaad Bhagat Singh: అప్పుడే పట్టించుకోలేదు.. ఇప్పుడు అంత సమయం లేదు

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:26 PM

'గబ్బర్‌సింగ్‌’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (ustaad Bhagat singh). సక్సెస్‌ఫుల్‌ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన అది సంచలనమే!

'గబ్బర్‌సింగ్‌’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (ustaad Bhagat singh). సక్సెస్‌ఫుల్‌ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన అది సంచలనమే! తాజాగా ఈ చిత్రంపై ఓ రూమర్‌ రావడంతో దర్శకుడు హరీశ్  శంకర్‌  స్ట్రాంగ్  (Harish Shankar counter) కౌంటర్‌ ఇచ్చారు. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఆగిపోయింది అంటూ ట్విట్టర్‌లో ఓ నెటిజన్  పోస్ట్‌ చేయగా, సదరు నెటిజన్స్ కు హరీశ్ శంకర్‌ ధీటుగా  సమాధానం ఇచ్చారు. ‘సినిమా మొదలు కాదు అన్నప్పుడే  రూమర్స్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు’ అని అన్నారు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీశ్‌ శంకర్‌ గతంలోనే చెప్పారు. ఇందులో పవన్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Ustaad.jpg

పవన్ కల్యాణ్‌ హామీ:

ఇటీవల పవన్ కల్యాణ్‌ పిఠాపురం ప్రాంతంలో పర్యటించారు. ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు 'ఓజీ ఓజీ’ అని అరుస్తుండగా 'తప్పకుండా చేద్దాం. ప్రస్తుతం నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేయాలి. మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఓ మూడు నెలలపాటు ఆ పనుల్లోనే బిజీగా ఉంటా. ఆ తర్వాత సెట్స్‌ మీదున్న సినిమాల గురించి ఆలోచిస్తా. ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ఓజీ సెట్‌లోకి వెళ్తే.. మీరంతా క్యాజీ’ అంటారు అని కల్యాణ్‌ చమత్కరించారు.మర్చిపోయినవన్నీ గుర్తుచేస్తా: హరీశ్‌ శంకర్‌
అలాగే రవితేజ హీరోగా హరీశ్  శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఈ సినిమాలోని పాట టీజర్‌ను విడుదల చేశారు. దీనిలో 90 దశకంలో ఎక్కువగా ఉపయోగించినవి చూపించారు. అప్పట్లో టీవీలో వచ్చే చిత్రలహరి, మహాభారతం ఇమేజ్‌లు, క్యాసెట్‌ బీ సైడ్‌ ఈ టీజర్‌లో కనిపించాయి. దానిపై కొందరు అభిమానులు సినిమాలో ఇంకా ఏమేం చూపించబోతున్నారు’ అని ప్రశ్నించగా ‘మీరు మర్చిపోయినవన్నీ గుర్తుచేస్తా..  మీకు గుర్తున్నవన్నీ మళ్లీ చూపిస్తా’ అని  హరీశ శంకర్‌ రిప్లై ఇచ్చారు. రాసుకొచ్చారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

Updated Date - Jul 05 , 2024 | 06:29 PM