Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

ABN , First Publish Date - 2023-05-11T17:08:24+05:30 IST

‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదల తేదీని పురస్కరించుకుని.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర గ్లింప్స్‌‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది
Pawan Kalyan in Ustaad Bhagat Singh

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మరో మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదల తేదీని పురస్కరించుకుని.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర గ్లింప్స్‌‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

గ్లింప్స్ విషయానికి వస్తే.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో.. అధర్మము వృద్ది చెందునో.. ఆ సమయమున ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను..’ అని భోదిస్తున్న బోధనతో ఈ గ్లింప్స్ మొదలైంది. భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్.. పత్తర్ గంజ్, పాతబస్తీ అని పవన్ డైలాగ్‌తో పాటు.. కారులో నుంచి పవర్ ఫుల్ ఎంట్రీని చూపించారు. ఇక చేతిలో టీ ఉన్న గాజు గ్లాస్‌తో కుర్చీలో కూర్చుని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేస్తోంది. ‘ఈసారి పెర్‌ఫార్మెన్స్ బద్దలైపోద్ది’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన తీరు, అతని మ్యానరిజమ్స్.. నిజంగా ఈసారి ‘గబ్బర్ సింగ్’ని మించి అనేలా ఉంది. ఓవరాల్‌గా ఇందులో చెప్పినట్లుగా ‘ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనేది ఈ గ్లింప్స్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. (Ustaad Bhagat Singh Glimpse)

Bhagat-Singh.jpg

గ్లింప్స్ కంటే ముందే మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు. అంతకు ముందు ప్రీ లుక్ పోస్టర్‌ వదిలి.. పవర్ ఫుల్ పోస్టర్ రాబోతుందంటూ మేకర్స్ హైప్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన పోస్టర్‌తో క్రేజ్ డబులైంది. ఇక గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌‌కి పూనకాలు వచ్చేలా చేశారు. ‘గబ్బర్‌ సింగ్’ సినిమా టైమ్‌లో కూడా ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే చిన్న డైలాగ్‌తో సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేసినట్లుగానే.. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అలాంటి వాతావరణాన్నే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)కు హరీష్ శంకర్ ఈ గ్లింప్స్‌తో కల్పించారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

Updated Date - 2023-05-11T17:37:08+05:30 IST