Ustaad Bhagat Singh: ఆనంద్‌సాయి ఫొటో లీక్‌తో ట్రెండింగ్‌లో..

ABN , First Publish Date - 2023-08-21T14:15:24+05:30 IST

‘బ్రో’ సినిమాలో ప్రేక్షకులను అలరించారు పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. వారాహి విజయయాత్ర మూడో విడత పూర్తి చేసుకున్న పవన్‌ సెప్టెంబర్‌ మొదటివారంలో షూటింగ్‌ చేయబోతున్నారు. తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కు సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ చిత్రం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Ustaad Bhagat Singh: ఆనంద్‌సాయి ఫొటో లీక్‌తో ట్రెండింగ్‌లో..

‘బ్రో’ సినిమాలో ప్రేక్షకులను అలరించారు పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. వారాహి విజయయాత్ర మూడో విడత పూర్తి చేసుకున్న పవన్‌ సెప్టెంబర్‌ మొదటివారంలో షూటింగ్‌ చేయబోతున్నారు. తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కు (Ustaad Bhagat Singh) సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ చిత్రం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఉంది. పవన్‌ కల్యాణ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సెట్‌లో పవన్‌తో కలిసి నడుస్తున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. దాంతో ఈ చిత్రం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాషెడ్యూల్‌ వచ్చే నెల మొదటివారంలో ప్రారంభమవుతుందని చిత్ర బృందం నుంచి సమాచారం. అయితే ‘ఈ షెడ్యూల్‌ ఎన్ని రోజులు చేస్తారు’ అన్నది తెలియాలి.

అయితే ఇప్పుడీ ఫొటో గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ‘ఈ ఫొటో ఎప్పుడు తీయించుకున్నారు?’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న పవన్‌ ఫొటో బయటకు వచ్చే సరికి అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గబ్బర్‌సింగ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పవన్‌, హరీశ్‌ శంకర్‌ కాంబో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పవన్‌ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోపాటు పవన్‌ ‘ఓజీ’, ‘హరిహరవీరమల్లు’ చిత్రాలు చేస్తున్నారు. ‘ఓజీ’కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ వస్తూనే ఉంది. కానీ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-08-21T14:26:50+05:30 IST