రానా, కంగనా, రవిబాబు మూవీ.. టైటిల్‌ ఏంటంటే?

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:13 PM

సౌత్, నార్త్ సినీ పరిశ్రమల్లో ఎప్పుడూ వైవిధ్యమైన ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే భళ్లాలదేవ రానా దగ్గుబాటి, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రవిబాబు కలయికలో ఓ అనూహ్యమైన, క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.

Scary Picture Announcement

సౌత్, నార్త్ సినీ పరిశ్రమల్లో ఎప్పుడూ వైవిధ్యమైన ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే భళ్లాలదేవ రానా దగ్గుబాటి (Rana Daggubati), బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut), టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రవిబాబు (Ravi Babu) కలయికలో ఓ అనూహ్యమైన, క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. హాలోవీన్ సందర్భంగా న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన ‘హారర్‌కాన్ ఇండియా 2026’ వేదికగా రానా దగ్గుబాటి స్వయంగా ఈ సర్‌ప్రైజింగ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘స్కేరీ పిక్చర్’ (Scary Picture) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.


ఈ వేదికపై రానా మాట్లాడుతూ.. ‘‘ఇదొక పూర్తి స్థాయి హారర్ చిత్రం. నా స్నేహితుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు-దర్శకుడు రవిబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తెలుగులో ఎన్నో అద్భుతమైన సస్పెన్స్, హారర్ చిత్రాలు తీశారు. దర్శకుడిగా హిందీలో ఆయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా టైటిల్‌ను నార్త్ మీడియాకు కూడా ఇవ్వకుండా నేరుగా ఇక్కడే తొలిసారి రివీల్ చేస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించనుండగా, వేదికపై రానా అనౌన్స్ చేసిన వీడియోను కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేస్తూ ప్రాజెక్ట్‌ను ధ్రువీకరించారు.


టాలీవుడ్ సీనియర్ నటుడు దివంగత చలపతిరావు తనయుడైన రవిబాబు.. ‘అనసూయ’, ‘అవును’ వంటి చిత్రాలతో తెలుగులో హారర్ థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఇప్పుడు ఆయన హిందీ తెరకు పరిచయమవుతూ నేరుగా కంగనాతో సినిమా చేయనుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ (Prabhas Film Ek Niranjan) సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన కంగనా.. ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’, ‘చంద్రముఖి 2’ వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఇటీవల ‘భారత్ భాగ్య విధాత’ చిత్రంతో మెప్పించిన ఆమె, ఇప్పుడు రవిబాబు మార్క్ హారర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రానా దగ్గుబాటి బ్యాకింగ్‌లో రానున్న ఈ ‘స్కేరీ పిక్చర్’ ప్రాజెక్ట్ భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

నాని ‘బ్లడీ రోమియో’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..

RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌కు అర్థమేంటి?

Updated Date - Nov 02 , 2026 | 12:13 PM

Kangana Ranaut : అన్ని బంధాలు నిలబడవు.. నా పెళ్లి ఎలా ఉండాలంటే..

Kangana Comments: అప్పట్లో వేషధారణ ఎలా ఉండేదో ఊహించగలరా?

Kangana Ranaut : 50 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి.. నాకు దక్కిన అవకాశం!

Rana Daggubati -Nepotism : బంధుప్రీతి కొంతవరకే.. వారికి నేనెవరినో కూడా తెలీదు!

Rana Daggubati: తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్.. రానా సపోర్ట్