సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆదర్శ కుటుంబం.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేది ఎప్పుడు?

ABN, Publish Date - Nov 22 , 2026 | 05:57 PM

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 - ఏకే 47’. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

AK 47 Movie OTT Update

విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 - ఏకే 47’ (Aadarsha Kutumbam House No: 47 - AK47) ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 30వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాలకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి రంగం సిద్ధమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, రాబోయే శుక్రవారం అంటే నవంబర్ 27వ తేదీ నుంచి ‘ఆదర్శ కుటుంబం - ఏకే 47’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం ఐదు భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్ట్రీమింగ్ తేదీపై నెట్‌ఫ్లిక్స్ కానీ, చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ నుంచి కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. నవంబర్ 27న స్ట్రీమింగ్‌ అవుతుందా? లేదా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. అలాగే నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడు ఇంటిల్లిపాదీ కలిసి నెట్‌ఫ్లిక్స్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా 5 డేస్ టైమ్ ఉంది కాబట్టి.. నవంబర్ 27న స్ట్రీమింగ్ అంటూ సడెన్‌గా ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి.. నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందో..

ఇవి కూడా చదవండి:

‘డ్రాగన్’ సింగిల్ పార్టేనా.. నీల్ సంచలన నిర్ణయం

హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?

‘నీతో ఓ అడుగు’.. ‘రాయవలస’ ప్రేమ గీతం అదిరింది

Updated Date - Nov 22 , 2026 | 05:57 PM