హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
ABN , Publish Date - Nov 21 , 2026 | 08:45 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుని సూర్య తన మార్కెట్ రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుని సూర్య తన మార్కెట్ రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ‘కరుప్పు’ (Karuppu), ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) చిత్రాలతో పాటు ఇటీవల విడుదలైన ‘సీన్’ (Scene) సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించడంతో ఇండస్ట్రీలో సూర్య క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా కోసం భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సూర్య తన తర్వాతి సినిమా కోసం ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యూనరేషన్ కోట్ చేస్తున్నారట. గతంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి దాదాపు రూ. 65 కోట్ల వరకు పారితోషికం అందుకున్న సూర్య, ఇప్పుడు వరుస విజయాలు, పెరిగిన మార్కెట్ దృష్ట్యా తన రెమ్యూనరేషన్‌ను మరో రూ. 10 కోట్లు పెంచినట్లు తెలుస్తోంది. ఒకవైపు థియేట్రికల్ కలెక్షన్లు, మరోవైపు ఆయన సినిమాలకు ఓటీటీ (OTT) మార్కెట్‌లో భారీ స్థాయిలో డీల్స్ కుదురుతుండటంతో నిర్మాతలు కూడా సూర్య అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదని టాక్.
ఇదిలా ఉంటే, కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సూర్య కనకవర్షం కురిపిస్తున్నారు. సూర్య నిర్మాణంలో కేవలం రూ. 23 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సీన్’ (Scene) చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి పది రెట్లు అధికంగా లాభాలు తెచ్చిపెట్టడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇలా అటు నటుడిగా హ్యాట్రిక్ విజయాలతో, ఇటు నిర్మాతగా భారీ లాభాలతో బాక్సాఫీస్‌ను శాసిస్తున్న సూర్య.. తన తదుపరి ప్రాజెక్టులతో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తారో చూడాలి! ప్రస్తుతం సూర్య లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది.
ఇవి కూడా చదవండి:
‘నీతో ఓ అడుగు’.. ‘రాయవలస’ ప్రేమ గీతం అదిరింది
Megaverse: పవన్, ప్రభాస్, సూర్య.. లిస్ట్ చూస్తుంటే మతిపోతోందిగా
టాలీవుడ్ యాక్షన్ క్వీన్స్ లిస్ట్‌లోకి నేషనల్ క్రష్