ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:49 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిత్ర పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సరే.. థియేటర్లలో దాని లైఫ్ స్పాన్ గరిష్టంగా నాలుగు వారాలు, అంటే కేవలం 28 రోజులు మాత్రమే ఉంటోంది.

Ghattamaneni Heroes

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిత్ర పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సరే.. థియేటర్లలో దాని లైఫ్ స్పాన్ గరిష్టంగా నాలుగు వారాలు, అంటే కేవలం 28 రోజులు మాత్రమే ఉంటోంది. 29వ రోజు రాగానే నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో దర్శనమిస్తున్నాయి. భారీ వసూళ్లు రాబడితే మరో వారం పాటు థియేటర్లలో కొనసాగడం గగనమైపోతోంది. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఎంతో ఘనంగా జరుపుకునే 50 రోజుల షీల్డులు, 100 రోజుల సంబరాలు మరుగునపడి దశాబ్దాలు కావస్తోంది. అలాంటి నేటి రోజుల్లో.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన ఓ సినిమా ఒక థియేటర్‌లో ఏకంగా శతదినోత్సవం పూర్తి చేసుకుందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఆడింది అనడం కంటే అభిమానులే స్వయంగా ఆడించారనడం కరెక్ట్. అలా తమ అభిమానానికి హద్దులు లేవని నిరూపించింది మరెవరో కాదు.. ఘట్టమనేని వీరాభిమానులు.


దివంగత లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడిగా, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జై కృష్ణ (Jay Krishna Ghattamaneni) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అజయ్ భూపతి కూడా బహిరంగంగా అంగీకరించారు. సినిమా రిజల్ట్ నిరాశపరచడంతో కేవలం మూడు వారాల వ్యవధిలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అయితే సినిమా ఫలితంతో మాకేం సంబంధం లేదు.. ఆయన మా ఘట్టమనేని ఇంటి వారసుడు అంటూ అభిమానులు సరికొత్త చరిత్రకు తెరలేపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమాను వరుసగా ప్రదర్శిస్తూ నవంబర్ 6వ తేదీతో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేయించారు. ఈ వార్త సోషల్ మీడియాలో బయటకు రావడంతో ప్రస్తుతం అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. ‘ఓటీటీలో ఎప్పుడో వచ్చేసిన ఫ్లాప్ సినిమాను థియేటర్‌లో వంద రోజులు ఆడించడం ఏంటి? ఇంతలా నెత్తిన మోయడం అవసరమా?’ అంటూ కొందరు నెటిజన్లు పెదవి విరుస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.


ఈ విమర్శలకు ఘట్టమనేని ఫ్యాన్స్ అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇది సినిమాను బలవంతంగా రుద్దడం కాదని, తమ ఆరాధ్య నటుడి కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడం అంటూ వారు స్పష్టం చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడికి, మహేష్ బాబు తర్వాత ఆ ఇంటి నుంచి వచ్చిన మూడో తరం వారసుడికి తమదైన శైలిలో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పామని గర్వంగా చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు వేటాడుతూనే, మరోవైపు రక్తదానాలు, అన్నదానాల వంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఘట్టమనేని ఫ్యాన్స్ (Ghattamaneni Fans).. ఇప్పుడు తమ హీరో సినిమా కోసం సొంత జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి మరీ ఈ ఫీట్ సాధించారు. వాళ్ల అభిమానం వాళ్ల ఇష్టం, ఎవరికీ నష్టం చేయనంత వరకు తప్పుపట్టాల్సిన పనిలేదని సినీ ప్రియులు సైతం సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా, ‘ఘట్టమనేని అభిమానులు ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది’ అంటూ టాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఎంగేజ్‌మెంట్ తర్వాత తేజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?

ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే

Updated Date - Nov 07 , 2026 | 08:49 PM

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Srinivasa Mangapuram OTT: షాకింగ్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి రొమాంటిక్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

Srinivasa Mangapuram Trailer: కృష్ణ మ‌నవ‌డు.. అద‌ర‌గొట్టాడుగా

Srinivasa Mangapuram: కృష్ణ మ‌నుమ‌డు.. రంగంలోకి దిగాడు! తొలి వార‌సుడి.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన మ‌హేశ్ బాబు

Jaya Krishna G: మహేష్ బాబాయ్ చాలా స్పష్టంగా చెప్పారు