నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026.. దరఖాస్తుల షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:58 AM

నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026 కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది.

Nandi Awards

నంది నాటక బహుమతులు-2025 (Nandi Nataka Bahumathulu 2025), కందుకూరి పురస్కారాలు-2026 (Kandukuri Puraskaramulu 2026) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ (AP Film TV Theatre Development Corporation) ఎండీ కె.ఎస్. విశ్వనాథన్ (KS Viswanathan) ఆదివారం ప్రకటించారు.

తెలుగులో రాసిన పద్య నాటికలు, సాంఘిక నాటికలు, బాలల నాటికలు, కళాశాల/ విశ్వవిద్యాలయాల నాటికలు, నాటక రంగంపై రచించిన పుస్తకాల విభాగాల్లో చరఖా స్తులను పరిశీలిస్తామని తెలిపారు. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాల, విశ్వవిద్యాల యాలు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.

అలాగే నాటక రంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న నాటక కళాకారులు, దర్శకులు, సాంకేతికనిపుణులు, రచయితలు, నాటక సమా జాల వారికి రాష్ట్రస్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక పురస్కారం, జిల్లాస్థాయిలో కందు కూరి విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తామని వెల్లడించారు.

దరఖాస్తులను అక్టోబరు 20 నాటికి ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి సంబంధిత పత్రాలతో జతపరచి, ఆయా స్క్రిప్టులను వచ్చేనెల 26 నాటికి తమకు అందజేయా లని సూచించారు. వివరాలకు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

కాగా, నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారా లు-2026 షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేస్తూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించారు.

దరఖాస్తుల ఆహ్వానానికి ఈ నెలలో నోటిఫికేషన్ జారీచేస్తారు. డిసెంబరు నాటికి దరఖాస్తులు పరిశీలించి, ప్రాథమికంగా ఎంపిక చేసిన పేర్లు ప్రకటిస్తారు. జనవరిలో తుది జాబితా విడుదల చేసి అదే నెలలో పురస్కారాలు అందిస్తారు.

వైఎస్ఆర్ పేరుతో అవార్డు!

కూటమి ప్రభుత్వం రంగస్థల అవార్డులకు వైఎస్ఆర్ పేరు తొలగించింది. అయితే ఈ పురస్కారాలను ఐదుగురు ప్రముఖల పేర్లతో ఇవ్వాలని నిర్ణయించింది. అందులో స్థానం నరసింహా రావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావుతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చ‌ద‌వండి..

విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఏం చెప్పారంటే?

వరంగల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారక్క’ పేరు పెట్టండి.. సీఎం పిలుపుకు దర్శకుడి స్పందన

పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది

Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!

అప్పుడు వ‌రుస డిజాస్ట‌ర్లైనా ఛాన్సులు.. ఇప్పుడు హిట్ ప‌డినా ప‌ట్టించుకోవ‌ట్లేదు

Nani: ఇంకో 15 ఏళ్లు.. డూప్‌తో పనిలేదు

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Vishwambhara Release: విశ్వంభరపై వశిష్ఠ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్

నాని.. ఇక లేదు గ్యాపు! రాబోయే రెండేళ్లు.. ఫుల్ ట్రీటు

రాజమౌళి సెంటిమెంట్.. ‘కుంభ’ బ‌ల ప‌డ‌తాడా లేక బలవుతాడా?

Updated Date - Sep 21 , 2026 | 12:22 PM