అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
ABN, Publish Date - Apr 20 , 2026 | 11:14 PM
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుకు చెందిన ఓ ఆసక్తికర విషయాన్ని బండ్ల గణేష్ పంచుకున్నారు.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పుట్టినరోజు వేడుకలో బండ్ల గణేష్ (Bandla Ganesh) మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుకు చెందిన ఓ ఆసక్తికర విషయాన్ని బండ్ల గణేష్ పంచుకున్నారు. అలాగే, చంద్రబాబును విమర్శించే వారిపై కూడా బండ్ల ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ..
‘‘మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లినప్పుడు జరిగిన సంఘటన ఇది. అక్కడ రాత్రి 10 గంటలకి స్టాఫ్‌ని అందరినీ పంపించేశారట. అందరూ వెళ్ళిపోండి రేపు మార్నింగ్ 6 గంటలకి రండి అని అన్నారట. తన పక్కనే ఉన్న ఒక మిత్రుడితో.. ‘నేను స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీగా ఉండు బయటికి వెళ్దాం’ అన్నారట. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని అన్నారట. ఆయన పక్కనే ఉన్న వ్యక్తికి.. ‘ఎక్కడికి తీసుకెళ్లమంటారో, ఏ పబ్ కి తీసుకెళ్లమంటారో, ఏ కార్యక్రమానికి తీసుకెళ్లమంటారో?’ అని ఒకటే ఆలోచనలు. నీట్‌గా తయారై వచ్చి, కారు ఎక్కు అన్నారట. ‘సార్ పబ్‌కి వెళ్లనీయమంటారా?’ అని ఆ వ్యక్తి అడిగితే.. ‘మీ ఊర్లో చెత్త ఎత్తే విధానం చూపించు. చెత్తను సింగపూర్‌లో ఏ విధంగా క్లీన్ చేస్తారో చూపించు. సింగపూర్‌లో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో చూపించు.. సింగపూర్‌లో లేబర్ ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు’.. అన్నారట. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఆయన అలా చెబుతూ సింగపూర్ మొత్తం చూసుకొని.. ‘ఇట్లా మా హైదరాబాద్ తయారు చేయాలయ్య. ఇట్లా చేస్తాను’ అని వచ్చి పడుకున్నారట. ఆ రోజు ఆయన భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు.
ఏరోజు కుటుంబం కోసం ఆలోచించలేదు, ఏరోజు తన స్వార్థం కోసం ఆలోచించలేదు, ఏరోజు ఆయన కుటుంబం, బావ బావమరిదిల భవిష్యత్ అని ఆలోచించలేదు. తెలుగు ప్రజలకి భవిష్యత్ ఇద్దాం, తెలుగు వాడిని ఎక్కడో పెడదాం, తెలుగు వాడిని ప్రపంచాన్ని శాసించే విధంగా, తెలుగు యువతని తయారు చేద్దాం. తెలుగు వాడు ఎవరిమీద ఆధారపడకూడదు. ఒకప్పుడు దివిసీమ తుఫాను వస్తే, ఆ రోజు వ్యవసాయం చేసుకునే కుటుంబంలో.. ఎట్లా బతకాలి? ఆ బిడ్డల్ని ఏం చేయాలి? అని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉండేవారు. వాళ్లందరికీ భగవంతుడి రూపంలో చంద్రబాబు నాయుడు వచ్చి, ఐటీ రంగాన్ని తీసుకొచ్చి, చదువుకొని ఈ రోజు ఒక్కొక్కరు లక్షలు, కోట్లు సంపాదిస్తూ బ్రహ్మాండంగా బతికేలా చేశారంటే.. అది చంద్రన్న దయ కాదా!
మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ విమర్శలు చేయడం నేర్చుకున్నారు. ఒక మంచి వ్యక్తిని విమర్శించడం చాలా ఈజీ. ఒక మంచి వ్యక్తిని, పోనీలే అనే మంచి వ్యక్తిని.. ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు నేను చెప్పేది ఒక్కటే.. ‘సార్ మీ బర్త్ డే రోజు అడుగుతున్నా, అన్యాయంగా మిమ్మల్ని విమర్శించేవాళ్లను ఊరుకోవద్దు సార్.. మిమ్మల్ని విమర్శిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్’. సోషల్ మీడియా ఉంది కదా అని.. ‘ఆయనేం చేస్తున్నారు?’ అని బాగా విమర్శిస్తున్నారు. అలాంటి వారందరినీ అడుగుతున్నా.. నువ్వు ఒక పదిమందికి సహాయం చెయ్, నువ్వు పదిమందికి భవిష్యత్తు ఇవ్వు, పదిమందికి జీవితాన్ని, పదిమందికి పది కంపెనీలు తీసుకురా? అని అడుగుతున్నా. ఎన్నెన్నో కంపెనీలు తీసుకొచ్చి, ఎందరికోసమో రాత్రి, పగలు తిరిగి, చలిలో కూడా షర్టు వేసుకొని మామూలు కుర్రాళ్లలా నడుచుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి మీకు నోరు ఎలా వస్తుంది? అని అడగాలనిపిస్తోంది. ఒక పని చేసేవాడిని ప్రోత్సహించండి.
ఇదే కేబీఆర్ (KBR) పార్క్ ముందు చంద్రబాబు 100వ పుట్టినరోజు ఆయన సమక్షంలో ఘనంగా చేసుకునే రోజు వస్తది.. వస్తుందంతే. రాబోయే 25 ఏళ్ల పాటు అమరావతిని అద్భుతంగా చేసి, తెలుగు ప్రజలకు మంచి భవిష్యత్తుని కల్పించి, తెలుగు వాళ్ళందరూ ప్రపంచంలో మేమున్నాం, ‘వి ఆర్ తెలుగు పీపుల్’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లే సమర్థత గల నాయకులు చంద్రబాబు నాయుడు. ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతోమందిని తయారు చేసిన ఫ్యాక్టరీ చంద్రబాబు ఫ్యాక్టరీ’’ అని తనదైన తరహాలో స్పీచ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!
సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!