Bandla Ganesh: కారు దిగగానే చిరు కాళ్లమీద పడ్డ బండ్ల గణేష్
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:21 PM
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గత కొన్నేళ్లుగా సినిమాల్లో యాక్టివ్ గా లేడు అన్న విషయం తెల్సిందే.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గత కొన్నేళ్లుగా సినిమాల్లో యాక్టివ్ గా లేడు అన్న విషయం తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను ఎక్స్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసం బండ్ల ఇండస్ట్రీ మొత్తానికి తన ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశాడు.
దీపావళీ పండగ సందర్భంగా తన ఇంట్లోనే ఇండస్ట్రీ అందరికి పార్టీ ప్లాన్ చేశాడు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. దీపాల కాంతుల్లో బండ్ల ఇల్లు మెరిసిపోతుండగా.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉండడంతో కళకళలాడుతుంది. వెంకటేష్, సిద్దు జొన్నలగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, శ్రీకాంత్ లాంటి పెద్ద పెద్ద వారందరూ హాజరయ్యారు.
ఇక చిరంజీవి కూడా పార్టీకి విచ్చేశాడు. చిరు అలా కారు దిగగానే బండ్లన్న.. ఆయన కాళ్లను మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. చేయి పట్టుకొని చిరును లోపలికి తీసుకెళ్లి ఆయనకంటూ ఒక సపరేట్ చైర్ లో కూర్చోబెట్టి అభిమానాన్ని చూపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీకి బండ్ల గణేష్ ఎంత పెద్ద భక్తుడో అందరికీ తెల్సిందే. చిరు అయినా, పవన్ అయినా బండ్ల అభిమానం ఇలాగే ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Yellamma: దేవిశ్రీ పక్కన మహానటి.. ఒప్పుకుంటుందా
Vishal: 119 కుట్లు.. అంత రిస్క్ ఎందుకు బ్రో