Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్లన్న అన్నది ఎవరిని.. ?
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:34 PM
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల..
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల.. ఆ తరువాత నిర్మాతగా కూడా మారి మంచి మంచి సినిమాలను నిర్మించాడు. ఇక బండ్ల.. పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద వీరాభిమానినో అందరికీ తెల్సిందే. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. దేవుడిని కూడా మనకు మంచి చేయకపోయినా.. మనల్ని పట్టించుకోకపోయినా తిట్టుకుంటాం.
బండ్ల కూడా అలానే కొంతకాలంగా పవన్ ను వ్యతిరేకిస్తున్నాడు. ఇన్ డైరెక్ట్ గా పవన్ పై పంచ్ లు వేస్తున్నాడు. తనను దూరం పెట్టినందుకు బాధపడుతూ పోస్టులు పెడుతున్నాడు. బండ్లన్న ఏ ట్వీట్ చేసినా అది పవన్ కే అని నెటిజన్స్ చెప్పుకొచ్చేస్తున్నారు. గత వారం నుంచి గణేష్ .. తన మనసులోని బాధను ట్వీట్స్ రూపంలో వేస్తున్నాడు.కానీ, అది ఎవరిని ఉద్దేశించి అనేది మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నాడు.
తాజాగా బండ్ల.. మరో ట్వీట్ వేశాడు. అందులో ' కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు' అంటూ రాసుకొచ్చాడు. అసలు ఏ ఉద్దేశ్యంతో బండ్ల ఈ ట్వీట్ వేశాడు అనేది తెలియడం లేదు. కానీ, కొంతమంది మాత్రం ఇది పవన్ కోసమే అని చెప్పుకొస్తున్నారు.తాను పవన్ కోసం ఎంత చేసినా.. ఆయన తానేమి చేయకుండా తనను దూరం పెట్టాడని అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి నిజంగా బండ్ల గణేష్ తన దేవుడినే కృతజ్ఞత లేదు అన్నాడా.. ? అనేది ఆయనకే తెలియాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Power star: పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో సుహాస్...
Vishal : 'మకుటం' సెట్స్ కు శింబు తండ్రి రాజేందర్